
ఆ భార్యాభర్తల పేర్లు ‘మిస్ వరల్డ్’తో ముడిపడి ఉన్నాయి. భర్త ‘మిస్ వరల్డ్ పోటీల సృష్టికర్త, భార్య ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ నినాదంతో ‘మిస్ వరల్డ్’ను దాతృత్వ దారిలోకి తీసుకువచ్చింది. మిస్ వరల్డ్ చైర్‌పర్సన్, సీయివో జూలియా మోర్లే వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. మాజీ మోడల్. మిస్ వరల్డ్‌ను తొలిసారిగా ప్రారంభించిన ఎరిక్ మోర్లే ఆమె భర్త.
2000 సంవత్సరంలో భర్త చనిపోయిన తరువాత ‘మిస్ వరల్డ్’ ఛైర్‌పర్సన్ అయింది జూలియ.1972లో ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ నినాదాన్ని తెర మీదికి తీసుకువచ్చింది. ఈ నినాదంలో భాగంగా సామాజిక సేవాకార్యక్రమాల కోసం డబ్బు సేకరించడానికి శ్రీకారం చుట్టారు.
2009లో ‘ఛారిటీ డిన్నర్’ నిర్వహించడం ద్వారా వచ్చిన నిధులతో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్’ ఏర్పాటు చేసింది. ‘సేవ్ ది చిల్డ్రన్’ క్యాంపెయిన్‌కుగానూ ‘ప్రియదర్శిని’ అవార్డు అందుకుంది.