నమితకు వీజీ మిసెస్‌ ఇండియా టైటిల్‌ | VG Mrs India Empress Curvy 2025 Winner: Namita Kulshrestha | Sakshi
Sakshi News home page

నమితకు వీజీ మిసెస్‌ ఇండియా టైటిల్‌

Aug 22 2025 10:39 AM | Updated on Aug 22 2025 11:03 AM

VG Mrs India Empress Curvy 2025 Winner: Namita Kulshrestha

ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్‌ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్‌ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్‌ శ్రేష్ట మిసెస్‌ ఇండియా–2025 టైటిల్‌ దక్కించుకున్నారు. ఈ మేరకు బేగంపేటలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నమిత కుల్‌ శ్రేష్ట కుటుంబ సభ్యులు పోటీల వివరాలను వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా 700 మంది మహిళలు మిసెస్‌ ఇండియా పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా చివరి నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఫైనల్స్‌కు 56 మంది ఎంపికైనట్లు తెలిపారు. 

ఇందులో కఠినమైన రౌండ్లు, సవాళ్లతో కూడిన పోటీలో జడ్జ్‌లు అడిగిన ప్రశ్నలకు ఆకట్టుకునే రీతిలో సమాధానాలు చెప్పిన నమితకు మిసెస్‌ సౌత్‌ జోన్‌ టైటిల్‌తో పాటు వయోవర్గంలో మిసెస్‌ ఇండియా–2025 టైటిల్‌ అందజేసినట్లు తెలిపారు. దీంతో పాటు మిసెస్‌ ఇండియా ఎలిగెన్స్, మిసెస్‌ ఇండియా గ్రేస్‌ఫుల్‌ సోల్, మిసెస్‌ ఇండియా చారిటీ క్వీన్‌ టైటిళ్లు కూడా దక్కాయని తెలిపారు.   

(చదవండి: డ్రెస్‌ స్టైల్‌నూ మార్చేయచ్చు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement