డ్రెస్‌ స్టైల్‌నూ మార్చేయచ్చు..! | Oversized Statement Jewelry Trends: Styling Tips for Every Occasion | Sakshi
Sakshi News home page

డ్రెస్‌ స్టైల్‌నూ మార్చేయచ్చు..!

Aug 22 2025 10:09 AM | Updated on Aug 22 2025 11:23 AM

jewelry scarves bags glasses and hats change an outfits style

పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్‌ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్‌ మెటల్‌తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్‌ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్‌గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్‌ డిజైన్స్‌ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది.  ట్రైబల్‌ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్‌ ఆభరణాలు డ్రెస్‌ స్టైల్‌ను మార్చేసే ‘హైలైట్‌ యాక్ససరీస్‌’గా నిలుస్తున్నాయి. 

ఇయర్‌ హ్యాంగింగ్స్‌
హూప్స్, జుమ్కీలు, డ్రాప్‌ ఇయర్‌ రింగ్స్, షెల్స్‌ లేదా జియోమెట్రిక్‌ షేప్స్‌.వన్‌ పీస్‌ డ్రెస్‌ లేదా సింపుల్‌ కుర్తీకి బాగా సెట్‌ అవుతాయి.

నెక్లస్, గాజులు
మొత్తం మెడ కవర్‌ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్‌ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్‌తో తయారు చేస్తారు. ప్లెయిన్‌ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్‌ వర్క్‌ ఉన్నవి. వెస్ట్రన్‌ – ట్రెడిషనల్‌ రెండింటికీ సెట్‌ అవుతాయి.

క్యాజువల్‌ లుక్‌ డైలీ వేర్‌ / ఫ్రెండ్స్‌ అవుటింగ్‌
షర్ట్‌ స్టైల్స్‌కి ఓవర్‌సైజ్డ్‌ ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ నెక్‌పీస్‌ + పెద్ద హూప్‌ ఇయర్‌ రింగ్స్‌. బోహో మ్యాక్సీ డ్రెస్‌ పైకి కలర్‌ఫుల్‌ బీడ్స్, షెల్‌ జ్యువెలరీ, బ్రాడ్‌ బ్యాంగిల్స్‌. కుర్తీ లెగ్గింగ్స్‌ పైకి ఆక్సిడైజ్డ్‌ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్‌ చేసే లాంగ్‌ ఇయరింగ్స్‌.

ఆఫీస్‌ లేదా ఫార్మల్‌ లుక్‌
ఆఫీస్‌ వేర్‌ పైకి సింపుల్‌ ఓవర్‌సైజ్డ్‌ రింగ్‌ + చిన్న హూప్స్‌ బాగుంటాయి. ఒకే రింగ్‌ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్‌ ఉంటుంది. కాక్‌టెయిల్‌ రింగ్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌. బ్లేజర్, ట్రౌజర్స్‌ పైకి పెద్ద చెయిన్‌ లేదా మందపాటి నెక్‌ పీస్‌ సెట్‌ అవుతుంది. కాటన్‌ లేదా లినెన్‌ శారీస్‌ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్‌ లేదా ఆక్సిడైజ్డ్‌ లాంగ్‌ ఇయర్‌ రింగ్స్‌.

పార్టీ ఈవెనింగ్‌ లుక్‌ 
బ్లాక్‌ డ్రెస్‌పైకి గోల్డెన్‌ చంకీ నెక్‌పీస్, పెద్ద స్టేట్మెంట్‌ రింగ్‌ బాగా నప్పుతుంది. గౌన్‌ పైకి షైనీ స్టోన్‌ ఓవర్‌సైజ్డ్‌ ఇయర్‌ రింగ్స్‌ సరి΄ోతాయి. నెక్లెస్‌ అవసరం లేదు.

కాక్‌టెయిల్‌ పార్టీ
మినిమలిస్టిక్‌ గౌన్‌కి ఓవర్‌సైజ్డ్‌ బ్రేస్‌లెట్‌ హైలెట్‌ అవుతుంది. సింపుల్‌ డ్రెస్‌కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్‌ లుక్‌. వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్‌కి బోల్డ్‌ మెటల్, ఆక్సిడైజ్డ్‌ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్‌కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్‌తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్‌ లుక్‌కి – చిన్న ఓవర్‌సైజ్డ్‌ రింగ్స్‌ లేదా లైట్‌ కలర్‌ హూప్స్‌. పార్టీ లుక్‌కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్‌ నెక్‌పీసులు అందంగా ఉంటాయి. 

సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు 
పట్టు చీరల మీదకు ఓవర్‌సైజ్డ్‌ కుందన్‌ లేదా టెంపుల్‌ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్‌ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్‌లెస్‌ లేకుండా హెవీగా ఉండే చాంద్‌బాల్‌ ఇయర్‌ రింగ్స్‌ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్‌ మీదకు లేయర్డ్‌ పెరల్‌ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్‌ అందంగా కనిపిస్తాయి.

మోడర్న్‌ ఫ్యూజన్‌ లుక్‌
క్రాప్‌ టాప్, స్కర్ట్‌ మీదకు ఓవర్‌సైజ్డ్‌ నెక్లెస్, లాంగ్‌ ఫెదర్‌ ఇయర్‌ రింగ్స్‌ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్‌ ఔట్‌ఫిట్స్‌కి ఆక్సిడైజ్జ్‌ సిల్వర్‌ ఓవర్‌సైజ్డ్‌ ఇయర్‌ రింగ్స్‌ బాగుంటాయి. ప్లెయిన్‌ జంప్‌సూట్‌ మీదకు బోల్డ్‌ జియోమెట్రిక్‌ నెక్లెస్‌ చుంకీ బ్రేస్‌లెట్‌ బాగా నప్పుతుంది.

ప్రకృతి నుంచి స్ఫూర్తి
జీన్స్‌, కుర్తీస్‌ కి పెర్ఫెక్ట్‌ లుక్‌ ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ జ్యువెలరీ అయితే బోహో లుక్‌ కోసం కలర్‌ఫుల్‌ బీడెడ్‌ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్‌ పార్టీ లుక్స్‌ కోసం యంగ్‌ జనరేషనల్‌లో బాగా పాపులర్‌గా ఉన్నది లేయర్డ్‌ నెక్‌పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్‌ షేప్‌ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ.  

జాగ్రత్తలు
ఔట్‌ఫిట్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్‌ లేదా ఇయర్‌ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. 

ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్‌ చేయాలి. 

ఓవర్‌సైజ్డ్‌ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్‌గా వేసుకోకూడదు. 

హెవీ ఇయర్‌ రింగ్స్‌ ధరించినప్పుడు హెవీ నెక్లెస్‌ వాడద్దు. 

సింపుల్‌ డ్రెస్‌ ధరించినప్పుడు ఓవర్‌ సైజ్డ్‌ జ్యువెలరీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. 

క్లచ్‌ లేదా హ్యాండ్‌ బ్యాగ్‌ కూడా జ్యువెలరీ షైన్‌ కి మ్యాచ్‌ అయ్యేలా చేసుకోవాలి. 

(చదవండి: ఇండియన్‌ స్పైసీ రెస్టారెంట్‌ ఇన్‌ జపాన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement