
జపనీస్ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్ జపాన్‌లోని కసుగలో ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.
బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్‌లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్‌కత్తాలో జపానీ రెస్టారెంట్ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్‌లు నిర్వహించింది.
‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్‌కు వెళ్లడానికి ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్‌కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు.
(చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..)