
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన కోర్టు గదిని దయతో న్యాయం అందించే పవిత్ర ప్రదేశంగా మార్చారు. ఆయన పలు తీర్పుల్లో నిందితులను దయతో క్షమించి మార్పు వచ్చేలా చేయడమే గాక బాధితుడికి న్యాయం అందేలా చేసేవారు కూడా. ఆయన తీర్పులందించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ భార్యభర్తల కేసు. ఇది కోర్టులో అంత్యంత నవ్వులు పూయించిన కేసు. భర్తను డామినేట్ చేస్తూ తానే మాట్లాడుతూ ఉండటం చూసి జడ్డి కాప్రియో సైతం నవ్వు ఆపుకోలేకపోయారు.
ఏంటంటే..భార్యభర్తలిద్దరూ ఒక కేసులో ఇరుకుంటారు. దాని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరవుతారు. అయితే భార్య లిండా ఫీల్డ్స్ తన భర్తను మాట్లాడనివ్వకుండా జరిమాన విధించిన చలానా తీసుకుని స్పీడ్‌గా కోర్టులోకి వచ్చి నాన్‌స్టాప్‌గా మాట్లాడేస్తూ ఉంటుంది.
మధ్యలో భర్త జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా..అవకాశం ఇవ్వకుండా. ఆ కారు తనదేనని, అయితే నడిపింది తన భర్తేనని చెబుతుంది. దోషిని తాను కానంటూ టకటక చెప్పేస్తుంది. ఆమె మాట్లకు ఆ కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఆమె తీరు చూసి న్యాయమూర్తి కాప్రియో కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అయితే మీరు భర్తను ఈ కేసులోకి పూర్తిగా ఇరికించేయాలనుకుంటున్నారు కదా అని అడగ్గా..మరి నేనెందుకు బలవ్వాలి అంటూ బదులిస్తుంది.
అంతా విన్నాక కాప్రియో అసలు ఎందుకు అంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారని ఆమె భర్తను ప్రశ్నించగా దానికి కూడా ఆమెనే బదులిస్తుంది. తమకొడుకు ఘోరమైన ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని. అతడి పర్యవేక్షణ నిమిత్తం తన భర్త రోజుకు రెండు మూడు సార్లు అక్కడకు వెళ్తున్నారని లిండా ఫీల్డ్స్ వివరిస్తుంది. ఆ హృదయపూర్వకమైన సంభాషణ అనంతరం ఆయన విశాల హృదయంతో ఆ కేసును కొట్టేస్తాడు.
ట్విస్ట్ ఏంటంటే..
పసుపు లైట్ వెళ్లినప్పుడూ కారు నడిపినందుకే జరిమానా పడిందని అనుకుంటారు ఆ భార్యభర్తలు, కానీ రెడ్‌లైట్ పడినప్పుడే కారు నడిపామని సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకుని కంగుతింటారు.
ఇక్కడ ఈ కేసులో తన భర్తదే తప్పన్నట్లు..భార్య మాట్లాడటం, తన భర్తకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం..వంటి భార్య అమాయత్వం తీరు అందర్నీ ఆకట్టుకుంది. చివర్లో తన భర్త కావాలని వేగంగా వెళ్లలేదంటూ చెప్పి న్యాయమూర్తి మనసుని గెలుచుకుంది. ఇది న్యాయమూర్తి కాప్రియా విచారించిన కేసుల్లో అత్యంత నవ్వు తెప్పించిన హాస్యస్పదమైన భార్యభర్తల కేసుగా నిలిచిపోయింది.
న్యాయమూర్తి కాప్రియో నేపథ్యం..
కాప్రియో సఫోల్క్ విశ్వవిద్యాలయ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేన్ పూర్తి చేశారు. అతను రోడ్ ఐలాండ్ ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేశాడు. అతను 1962లో ప్రావిడెన్స్ సిటీ కౌన్సిపట్టల్‌కు ఎన్నికయ్యాడు. కాప్రియో 1985 నుంచి 2023లో పదవీ విరమణ చేసే వరకు ప్రావిడెన్స్‌లో మునిసిపల్ జడ్జిగా పనిచేశారు.
ఆయన 2018 నుంచి 2020 వరకు టెలివిజన్ సిరీస్ కాట్ ఇన్ ప్రావిడెన్స్‌లో దయగల న్యాయమూర్తిగా నటించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. అదీగాక ఈ సిరీస్ జాతీయ స్థాయిలో ప్రశారం కావడంతో కాప్రియో మరింత ఫేమస్ అయిపోయారు. న్యాయం ఎల్లప్పుడూ దయను కలిగి ఉండాలనే ఆయన ఆ కాంక్షే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశ్యం కావడం విశేషం. అందువల్లే ఈ షో మరింత హైలెట్‌గా నిలిచి ఆయన పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది.
(చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..)