ఇక్కత్‌ వస్త్రాలు మా మనసు దోచాయి.. | African Representatives in bhoodanpochampally | Sakshi
Sakshi News home page

ఇక్కత్‌ వస్త్రాలు మా మనసు దోచాయి..

May 29 2025 11:35 AM | Updated on May 29 2025 12:05 PM

African Representatives in bhoodanpochampally

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు తమ మనసును దోచాయని ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన కంటెంట్‌ క్రియేటర్లు కొనియాడారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన 30 మంది సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్లు బుధవారం పోచంపల్లిని సందర్శించారు. స్థానిక టూరిజం పార్కు, కళాపునర్వి హ్యాండ్లూమ్‌ యూనిట్‌తో పాటు చేనేత వస్త్రాలను తయారీని పరిశీలించారు. 

ఇక్కత్‌ వస్త్రాలు మా మనసు దోచాయి..2

మగ్గం నేసి, రాట్నం వడికి సందడి చేశారు. ఇక్కత్‌ వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సమాచార అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మామిండ్ల దశరథ మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, ప్రజల ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన కంటెంట్‌ క్రియేటర్లు ఇక్కడికి వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ రాములు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇక్కత్‌ వస్త్రాలు మా మనసు దోచాయి..1

ఇండియా మూలాలు మరువలేదు
– యోవానీ నాయుడు, దక్షిణాఫ్రికా క్రియేటర్‌ 
మా నాన్న తెలుగు వారు, మా అమ్మ తమిళనాడుకు చెందినవారు. మా పూర్వీకులు శతాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. భౌతికంగా ఇండియాకు దూరమైనా ఇక్కడి మూలాలు మరువలేదు. నాకు తెలుగు, తమిళం రాకున్నా భారత సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నాను. 

ఇక్కత్‌ వస్త్రాలు మా మనసు దోచాయి..3

Advertisement
 
Advertisement
Advertisement