Miss world 2025 పెరిగిన ఇమేజ్‌! | Miss World 2025 At Telangana Writes G Laxman Kumar I&PR AD Karimnagar | Sakshi
Sakshi News home page

Miss world 2025 పెరిగిన ఇమేజ్‌!

May 30 2025 11:21 AM | Updated on May 30 2025 11:38 AM

Miss World 2025 At Telangana Writes G Laxman Kumar I&PR AD Karimnagar

హైదరాబాద్‌ ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా మారడంతో తెలంగాణ ఇమేజ్‌ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఏప్రిల్‌ నెలలో పెట్టు బడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్‌  సమ్మిట్‌’ను రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాదులో ఘనంగా నిర్వహించింది. 

దాదాపు వంద దేశాల నుంచి 400మంది పైగా ప్రతి నిధులు హాజరయ్యారు. తెలంగాణను ప్రత్యక్షంగా చూసిన వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలో పాల్గొంటున్నసుందరీమణులు తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలను తెలుసుకునేందుకు ‘తెలంగాణ జరూర్‌ ఆనా’ అనే నినాదంతో నిర్వహించిన ప్రపంచసుందరీమణుల పర్యటన కార్యక్రమం మనరాష్ట్రం ఓ పెద్ద ప్రపంచ పర్యాటక కేంద్రంగా అవతరించేందుకు వీలు కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో సుందరీమణుల ఆట పాటలు, పర్యటన విశేషాల ప్రత్యక్ష ప్రసారం... ఆ యా దేశాల పర్యా టకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా!

మిస్‌ వరల్డ్‌ పోటీలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను హైలైట్‌ చేయడమే కాక స్థానిక ఉత్పత్తులకు మంచి ప్రచారం కలించాయి. స్పెయిన్‌కు చెందిన కీమో ఫార్మా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరా బాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం ఈ సందర్భంగా గమనార్హం. పోటీల సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తుల వాడకం... స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. 

చదవండి: Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయం

– జి. లక్ష్మణ్‌ కుమార్‌ 
సమాచార–పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్, కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement