గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా! | My husband not driver : Polish woman slams stereotypes faced in India | Sakshi
Sakshi News home page

గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా!

May 29 2025 2:55 PM | Updated on May 29 2025 3:33 PM

My husband not driver : Polish woman slams stereotypes faced in India

సాధారణంగా  ఒక యువతి, యువకుడు  కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది.  అయితే పోలిష్ మహిళ  ఇతను నా భర్త   మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో  తెలుసుకుందాం రండి!

పోలెండ్‌ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను  ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం  సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి  చేసుకున్నారు. భారతదేశంలోని   పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో  ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. 

అయితే  ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత  అనుభవాన్ని గురించి సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కంటెంట్‌ క్రియేటర్‌ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ  అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో  ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్‌గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ  అసహనం వ్యక్తం చేసింది.

 "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్‌ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే,  తన టూర్ గైడ్‌తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్‌ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో  వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా  వ్యూస్‌ సాధించింది.  అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’,  ‘‘మీ మోటార్‌ లాగా మీరు మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి’’,  నిజం చెప్పాలంటే..  ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్‌గా షేవ్‌ చేసుకుంటే బెటర్‌’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ  బై డిఫాల్ట్‌   టూర్‌ గైడ్లు, డ్రైవర్లే   ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్‌ వెల్లువెత్తాయి.

"నేను నా  భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement