అందాల తారలు.. అందమైన హృదయాలు.. | Miss World 2025: Miss World contestants visited Balasadhan Hyderabad | Sakshi
Sakshi News home page

అందాల తారలు.. అందమైన హృదయాలు..

May 29 2025 9:08 AM | Updated on May 29 2025 9:08 AM

 Miss World 2025:   Miss World contestants visited Balasadhan Hyderabad

అందాన్ని దాటి అద్భుతమైన హృదయాన్ని చూడగలిగితే స్ఫూర్తినిచ్చే మనసులెన్నో, మనుషులెందరో..! దీనికి నిదర్శనంగా నిలిచింది నగరంలో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ వేదిక. రాష్ట్ర ప్రభుత్వం, మిస్‌ వరల్డ్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌ చారిటీ ఈవెంట్‌ దీనికి నిదర్శనంగా నిలిచింది. 

ప్రభుత్వ బాలసదన్‌ అనాథ పిల్లలకు సహకారం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు ఈ అనాథ చిన్నారులకు మేమున్నామంటూ పలకరించారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారుల చిట్టి పొట్టి పలుకులను ఆస్వాదించారు. 

(చదవండి: క'రెంట్‌' ట్రెండ్‌..అద్దెకు అ'డ్రెస్‌'..! ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ నుంచి రీల్స్‌ వరకు..)

వారితో ఆడారు, పాడారు, గుండెకు హత్తుకుని ఆతీ్మయత పంచారు. తారలు దిగివచ్చిన వేళ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న, హెచ్‌ఐవీతో జీవిస్తున్న పలువురు చిన్నారులు కష్టాలను మర్చిపోయి మధుర స్మృతులను పొందారు. 

సిస్టర్‌ సిస్టర్‌ ఈ తెలుగు పాటకు అలా స్టెప్‌ వేయొద్దు, నన్ను చూడు ఇలా వెయ్యు అంటూ పసితనాన్ని, స్వచ్ఛతను మిస్‌ తారలకు చూపించారు. కార్యక్రమంలో మాజీ మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనాతో పాటు మిస్‌ ఇండియా నందిని గుప్తా, వివిధ దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. 
(చదవండి: నందిని గెలిస్తే..నంబర్‌ వన్‌ మనమే..! అత్యధిక టైటిల్స్‌ గెలిచిన ఏకైక దేశంగా..)

Advertisement
 
Advertisement
Advertisement