source: X
వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నిఖిత పోర్వాల్ నిష్క్రమించింది. ఈ పోటీలో నిఖిత టాప్-40 వరకు చేరుకున్నప్పటికీ, టాప్-20లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖిత కల చెదిరింది.
ఫైనల్ సందర్భంగా నిఖిత భవ్నా రావు రూపొందించిన ప్రత్యేక గౌన్‌ను ధరించింది. పూల ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబెలిష్‌మెంట్, ఇటాలియన్ ట్యూల్‌తో రూపొందించిన ఈ దుస్తులు ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉజ్జయినికి చెందిన నిఖిత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత. పేజెంట్ ప్రపంచంలోకి రాకముందు నిఖిత టీవీ యాంకర్‌గా పని చేసింది. నటనలోనూ ఆమెకు అనుభవం ఉంది.


