breaking news
Nikita Porwal
-
మిస్ వరల్డ్ 2026 విజేతగా డొమినికన్ రిపబ్లిక్ భామ
వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిరీ మోలా విజేతగా నిలిచారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ ఒపల్ సుచాటా చువాంగ్స్రీ ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం అలంకరించారు.ఈ పోటీలో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేయ్నెస్ ఫస్ట్ రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.టాప్ 6 ఫైనలిస్టులుడొమినికన్ రిపబ్లిక్ – జోహెయిరీ మోలా: విజేతస్పెయిన్ – ఎలిసబెత్ రేయ్నెస్: ఫస్ట్ రన్నరప్మలేషియా – తానుసియా చెట్టి: సెకండ్ రన్నరప్వియత్నాం – లే న్గుయెన్ బావో న్గోక్దక్షిణాఫ్రికా – రొమాండా హోంబిర్ఎరిట్రియా – స్నిట్ హబ్టియాబ్: పీపుల్స్ ఛాయిస్భారత్కు నిరాశభారత్ తరఫున పాల్గొన్న నిఖిత పోర్వాల్ టాప్ 40లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్ 20కి అర్హత సాధించలేకపోయారు. దీంతో ఆమె మిస్ వరల్డ్ 2026 ప్రయాణం టాప్ 40 వద్ద ముగిసింది. అయితే భారత్ వరుసగా ఐదు మిస్ వరల్డ్ ఎడిషన్లలో ప్లేస్మెంట్ సాధించిన రికార్డును కొనసాగించింది. -
మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ ఇండియా ఔట్
వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నిఖిత పోర్వాల్ నిష్క్రమించింది. ఈ పోటీలో నిఖిత టాప్-40 వరకు చేరుకున్నప్పటికీ, టాప్-20లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖిత కల చెదిరింది.ఫైనల్ సందర్భంగా నిఖిత భవ్నా రావు రూపొందించిన ప్రత్యేక గౌన్‌ను ధరించింది. పూల ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబెలిష్మెంట్, ఇటాలియన్ ట్యూల్తో రూపొందించిన ఈ దుస్తులు ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఉజ్జయినికి చెందిన నిఖిత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత. పేజెంట్ ప్రపంచంలోకి రాకముందు నిఖిత టీవీ యాంకర్‌గా పని చేసింది. నటనలోనూ ఆమెకు అనుభవం ఉంది. -
మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్ అద్భుత నృత్యం..!
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత అయిన నికితా పోర్వాల్ వియత్నాంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉజ్జయినీకి చెందిన ఈ నటి డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' రౌండ్లో భాగంగా వేదికపై అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చారామె. గతరాత్రికి సంబంధించిన క్లిప్‌ను పంచుకుంటూ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇలా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by World Beauty Queen Press (@wpressofficial) 73వ మిస్ వరల్డ్ వేడుకల్లో భాగంగా నిర్వహించి డాన్సెస్ ఆఫ్ ది వరల్డ్ రౌండ్లో భాగంగా నికితా పోర్వాల్ తన అద్భుతమైన నృత్యంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందామె అని రాసుకొచ్చింది మిస్ ఇండియా ఆర్గనైజేషన్. అంతేగాదు నెటిజన్లు సైతం..నికితా కనిపించింది కొన్ని సెకన్లపాటు మాత్రమే అయినా..చూస్తుండిపోవాలనిపించింది. అత్యద్భుతంగా ఉంది అని ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ నువ్వు దేశానికి గర్వకారణంగా నిలిచావు. ప్రతి కన్నూ నీపైనే ఉంది, ప్రతి కెమెరా నిన్ను ప్రేమిస్తుంది, యావత్తు భారతదేశం నీతో ఉంది. నువ్వు వేదికపై అద్భుతమైన దేవతలా ఒదిగిపోయావు అని అభివర్ణిస్తూ పోస్టులు పెట్టారు. దేవి స్ఫూర్తిని ఆవిష్కరించారామె..మిస్ వరల్డ్ 2026లో 'డ్యాన్సెస్ ఆఫ్ ది వరల్డ్' రౌండ్ కోసం, నికితా పోర్వాల్ తోరాని బ్రాండ్ రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకున్నారు. రంగులు,కళ, దేవి స్ఫూర్తిని తెలియజేసే భారతీయ వేడుకను ప్రతిబింబించారు. ఆమె దుస్తులు రంగుల దేవత మీనాక్షి స్ఫూర్తితో రూపొందించిన దుస్తులను నికితా ఎంపిక చేసుకున్నారు. ఈ దుస్తుల్లో ఆమె లుక్ అత్యంత ముగ్ధమనోహరంగా ఉంది. విభిన్నమైన ఆ రంగుల కలయిక, క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, చేతితో వేసిన పేయింటింగ్లు ఉన్నాయి. ఇది ధోతి శైలి సిల్హౌట్. ఈ దుస్తలుకు అనుగుణంగా తలపై ధరించి దుప్పటా, చెవిపోగులు, అమామా జ్యువెలరీ రూపొందించిన శరీరాభరణాలు తదితరాలన్ని రాజసం ఉట్టిపడే లుక్‌ని అందించాయి. సంప్రదాయినిక ఆధ్యునిక వ్యాఖ్యానంలా దేవతను తలపించేలా ఉంది ఆమె ఆహార్యం. ఈ దుస్తుల్లో ప్రతి అంశ ఒక కథను చెబుతుందని, అది తనకెంతో నచ్చిందని అంటోంది నికితా. రంగు, అలంకరణ, కదలిక, కళాత్మకత, ఇవన్నీ శక్తిమంతమైన దేవతా రూప ఆవిష్కరణకు దారితీసిందని అన్నారామె. ప్రతి ఒక్కటి తన రూపానికి సుందరమైన జీవం పోశాయిని చెబుతోంది. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా మిస్ వరల్డ్ ఫినాలే జరగనుంది. ఎవరు కిరీటం దక్కించుకుంటారన్న దానిపైనే సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: Miss World 2026: సర్వాంగ సుందరీ మాత్రమేకాదు..అద్భుతమైన నటి..! మిస్ ఇండియా సైతం..) -
ఆమెలో అందం, అభినయం రెండూ..! మిస్ ఇండియా సైతం..
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మిస్‌వరల్డ్ అందాల పోటీల గ్రాండ్ ఫినాలో సెప్టెంబర్ 5, 2026న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్పైనే అందరి ఆశాలు, ఆకాంక్షలు. ఈ బ్యూటీ కేవలం అందగత్తె మాత్రం కాదు తనలో నటి కూడా ఉందంటూ వెండితెరపై మెరిసింది కూడా. ఆమె సంజీవ్ సింగ్ పర్మార్ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్రిజ్ భాషా చలనచిత్రం 'చంబల్ పార్'లో నటించింది. నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా సందర్భంగా అరాలూయెన్ సెంటర్లో ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శన జరుపుకుంది. ఇది త్వరలో భారత్‌లో కూడా విడుదలకానుంది. అందాల పోటీల్లో పాల్గొనేవారు కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అభినయంలో కూడా సత్తా చాటగలరని చూపించడమే తన ధ్యేయమని అంటోంది నికితా. ఆ విషయంలో తనకు ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెబుతోంది. ఎందుకుంటే ఆమె బరేలి నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్‌ఫాదర్స్ అండ దండ లేకుండా అంచలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసిందని అన్నారామె. ఇక నికితా కూడా త్వరలో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నారు. అంతేగాదు ఆమెకు కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఆమె ఇటీవలే కృష్ణ లీల' అనే పేరుతో 250 పేజీల రచన చేసినట్లు సమాచారం ఇక మిస్ ఇండియా ఆర్గనైజేషన్ సైతం నికితాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. ఫెమినా మిస్ ఇండియా వేదిక నుంచి అత్యున్నత ప్రపంచ వేదిక వరకు నికితాపోర్వాల్ తన మిస్ వరల్డ్ ప్రయాణంలో ప్రతి అడుగులో భారతదేశ స్ఫూర్తిని, బలాన్ని, కథను ముందుకు తీసుకువెళ్లారు. ఈ 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వేదికపై లక్షలాది ఆశలు, ఆశీస్సులు, అభినందనలను స్వదేశం నుంచి వియత్నాం వరకు ఆమెతోపాటు వస్తాయని పేర్కొంది. కాగా నిఖితా పోర్వాల్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మోడల్. ఆమె 18 ఏళ్ల వయసులో మీడియా రంగంలో కెరీర్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లపాటు ఆమె టీవీ యాంకర్‌గా పనిచేశారు. అలాగే ఆరేళ్లపాటు నటనలో శిక్షణ తీసుకున్నారామె. ఇక ఇప్పటికే ప్రారంభమైన ఈ మిస్ వరల్డ్ పోటీల్లో నికితా ఇండియా శాష్‌ను అందుకున్నారు. నిజంగా ఇది చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే తండ్రి లేదా తల్లి పేరుతో కాకుండా నాదేశం పేరుతో వచ్చే ఐడెంటిటీ అంటే ఆ ఫీలే వేరేలెవెల్ అని అంటోంది నికితా. కాగా ఈ ఫైనలిస్ట్ జాబితాలో ఇండోనేషియా, లావోస్, మలేషియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఆసియా, ఓషియానియ మల్టిమీడియా చోటు దక్కించుకోగా భారత్ ఇంకా బెర్త్ ఖరారు చేసుకోలేదు. View this post on Instagram A post shared by THẾ GIỚI HOA HẬU (@thegioihoahauofficial) -
40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్
రాబోయే మిస్‌వరల్డ్ పోటీల కోసం సన్నద్ధమవుతున్న మిస్ ఇండియా నికితా పోర్వాల్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు. ఏకంగా 40 వేల మంది విద్యార్థులు మానవ సముహాలుగా ఏర్పడి మిస్వరల్డ్గా ప్రదర్శించిన తీరు హైలెట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమం అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఈ అందాల పోటీలకు వెల్లువెత్తుత్ను మద్ధతు చూసి నికితా ఆశ్చర్యపోయింది. ఆశీర్వాదాల సంద్రం..ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఏప్రిల్ 13న 'ది పేజెంట్ జర్నీ' ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. వేలాదిమంది విద్యార్థులు ఐక్యతను ప్రదర్శిస్తూ..మైదానంలో ఏకమైన అద్భుతమైన దృశ్యం చూస్తే కళ్లు ఆర్పడం మర్చిపోతాం. గగనతలం నుంచి చూస్తే పచ్చదనంతో కూడిన మైదానంలో 'మిస్ వరల్డ్' అని అక్షరాల ఏరియల్ వ్యూస్‌లా కనిపించే మానవ నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో హై-నెక్, స్లీవ్‌లెస్ సిల్హౌట్‌తో కూడిన మెరిసే గులాబీ రంగు గౌనులో మిస్ ఇండియాగా కనిపించారు నికితా పోర్వాల్. ఆమె భారీ జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడూ..ఆ గౌనుపై ఉన్న మెరిసే డిజైన్ కాంతిలో మిస్ ఇండియా కిరిటంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా కనిపించింది. అక్కడున్న దాదాపు 40 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఒడిశా ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు. ఒడిశాలో నా కిరీటాన్ని ఇచ్చేస్తానేమో అనుకున్నా కానీ ఏమి ఇవ్వడం లేదు..కానీ నాతో ఈ 40 వేల మంది ఆశీస్సులను తీసుకువెళ్తున్నా. ఈ రోజు మనం ముంబై నుంచి బాబా జగన్నాథ్ నగరానికి వచ్చాం. ఇదేమి యాదృచ్ఛికం కాదు. మీరంతా ఈ దేశపు భూమి పుత్రికలు. మీ అందరికి ధన్యావాదాలు". అని తన ప్రసంగాన్ని ముగించారామె. సుమారు 130 దేశాలు పాల్గొంటున్న ఈ చారిత్రాత్మక మిస్ వరల్డ్ పోటీ కోసం నికితా వియత్నాంకు బయలుదేరుతుండటంతో ఆమెపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అదీగాక ఈ ఏడాది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం కూడా. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మిస్ వరల్డ్ 2026 ఫైనల్ సెప్టెంబర్ 5, 2026న జరగనుంది. వియత్నాంలోని హనోయి, హూచి మిన్ వంటి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌కు చెందిన నికితా పోర్వాల్ బలమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారు. 60కి పైగా నాటకాలలో నటించిన రంగస్థల కళాకారిణి టీవీ యాంకర్ కూడా ఆమె. అంతేగాదు నికితా అందం తోపాటు అపారమైన తెలివితేటలు ఉన్న వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారామె. View this post on Instagram A post shared by THE PAGEANT JOURNEY™ (@thepageantjourney) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్..! (ఫొటోలు)
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్‌లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్‌కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్‌గా పని చేసి మరుసటి రోజు స్కూల్‌కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్‌వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్‌గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్‌గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్‌లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు.


