క'రెంట్‌' ట్రెండ్‌..అద్దెకు అ'డ్రెస్‌' | the clothing rental market expanding at Hyderabad | Sakshi
Sakshi News home page

క'రెంట్‌' ట్రెండ్‌..అద్దెకు అ'డ్రెస్‌'..! ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ నుంచి రీల్స్‌ వరకు..

May 29 2025 8:55 AM | Updated on May 29 2025 1:45 PM

the clothing rental market expanding at Hyderabad

ఒకప్పుడు షూటింగుల్లో పాల్గొనడం అంటే అది నటీనటులకు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు షూట్స్‌ అంటే పలువురికి రోజువారీ వ్యాపకం కూడా అంటే అతిశయోక్తి కాదు. సోషల్‌ మీడియా వేదికగా పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్న అనేక మందికి తమ ఫాలోవర్లను మెప్పించే క్రమంలో తరచూ కొత్త గెటప్స్‌లో కనిపించాల్సి వస్తోంది. అలాంటి వారికి ఈ అద్దె దుస్తులు బాగా అక్కరకొస్తున్నాయి. మరోవైపు పెళ్లికి ముందు సర్వసాధారణంగా మారిన ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో పాటు అనేక రకాల స్వీయ చిత్రీకరణలు కూడా బాగా పెరిగాయి. ఇవి కూడా అద్దె దుస్తుల డిమాండ్‌ను పెంచేస్తున్నాయి.

పార్టీల జోరు.. ధరల బేజారు.. 
నగరంలో పార్టీ కల్చర్‌ విపరీతంగా పెరిగింది. వారానికి కనీసం రెండు మూడు పారీ్టలకు అటెండ్‌ అవ్వాల్సిన పరిస్థితి సిటీలో బిగ్‌ సర్కిల్‌ ఉన్న ప్రతీ వ్యక్తికీ సర్వసాధారణంగా మారింది. అయితే పారీ్టకి వెళ్లే ప్రతిసారి కొత్త డ్రెస్‌ కొనడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొంతమంది ప్రస్తుతం రెంటల్‌ వార్డ్‌డోబ్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. వీటి వల్ల బ్రాండెడ్‌వి, అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించే అవకాశం కూడా ఉంటుంది. గత కొన్నేళ్లలో ‘నేను రెంట్‌ డ్రెస్‌ వేశాను’ అని చెప్పడం కొంతమందికి ఇబ్బంది, సిగ్గు కలిగించేది. కానీ ఇప్పుడు అది ‘కూల్‌’ ట్రెండ్‌గా మారిపోయింది.

ట్రెండ్‌ వయసు టెన్‌ ఇయర్స్‌.. 
నగరంలో ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది ‘ర్యాప్డ్‌’ అనే రెంటల్‌ సరీ్వస్‌ అని చెప్పొచ్చు. ‘నేను ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు చాలామంది ఇది మంచి ఐడియా కాదు, ఎవరూ డ్రెస్‌లను రెంట్‌కు తీసుకోరని వారించారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారిని మా స్టోర్లో చూడవచ్చు’ అంటూ చెప్పారు ర్యాప్డ్‌ నిర్వాహకులు రితూ మల్హోత్రా. ‘నేటి ఫ్యాషన్‌ వేగంగా మారుతుంది ప్రతి కొత్త ట్రెండ్‌ను కొనుగోలు చేయడం ఖరీదైనదే కాక, వాటిని ఉంచడానికి అవసరమైన ప్రదేశం కూడా పెద్ద సమస్య అవుతుంది. 

అందుకే.. రెంటల్‌ సర్వీసు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడం అంటే కేవలం మన జేబుకు మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా మంచిది’ అన్నారామె. కొన్ని సంవత్సరాలుగా రెంట్‌ డ్రెస్‌లు వేసుకుంటున్నాను. చాలా గొప్ప డిజైన్లు, ఎంపికలు ఉన్నాయి. పైగా, చాలా మంచి క్వాలిటీని కూడా అందిస్తున్నారు’ అంటున్నారు సైకాలజీ విద్యార్థిని వైష్ణవి.  

సూచనలు.. 
అడ్వాన్స్‌ బుకింగ్‌: ప్రత్యేక సందర్భాలకు ముందుగానే బుకింగ్‌ 
చేయడం మంచిది. 
పలు సంస్థలు ఫ్రీ అల్టరేషన్లు అందిస్తాయి. 
దుస్తులు డబుల్‌ డ్రైక్లీన్‌ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసుకోవాలి.   
ఒక రోజు, 36 గంటలు.. ఇలా విభిన్న కాలవ్యవధులు ఉన్నాయి కాబట్టి సరిగా ధ్రువీకరించుకోవాలి.  

సందర్భోచితంగా.. అందుబాటు ధరల్లో..
నగరంలో అద్దెకు తీసుకునేందుకు పార్టీ వేర్‌కి ఒక రోజుకు అద్దె సుమారు రూ.1,500 నుంచి రూ.3,500 వరకూ.. సంప్రదాయ దుస్తులైతే రూ.2,500 నుంచి రూ.6,000 వరకూ, వెస్టర్న్‌ ఫ్యాషన్‌ (డ్రెసెస్, సూట్స్‌) రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు(ఒక రోజు అద్దె) వరకూ మగవాళ్ల దుస్తులు(షర్ట్స్, టీ–షర్ట్స్, బ్లేజర్స్‌): రూ.800 నుంచి రూ.2 వేల వరకూ ఉన్నాయి. 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మహిళల లెహంగాలు, షేర్వానీలు, గౌన్లు, పాశ్చాత్య దుస్తులు అందించేందుకు ర్యాప్డ్‌ మదాపూర్‌ – బేగంపేట్‌ పరిసరాల్లో సేవలు అందిస్తుండగా, వీరి దగ్గర దుస్తుల అద్దెలు రూ.3 వేల నుంచి, రూ.16,500 వరకు లభిస్తున్నాయి. అలాగే ఈసీఐఎల్‌ ప్రాంతంలోని తారా డిజైనర్స్‌ సంస్థ ప్రీ–వెడ్డింగ్‌ గౌన్లు, మ్యాటరి్నటీ ఫొటోషూట్‌ దుస్తులు, కపుల్‌ అవుట్‌ఫిట్స్‌కు పేరొందింది. 

కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లోని సైలీజింగ్‌ అనే సంస్థ లాంగ్‌ ట్రెయిల్‌ గౌన్లు, లెహంగాలు, మ్యాటరి్నటీ గౌన్లుకు పేరొందింది. అమీర్‌పేట్‌లోని ప్రీ వెడ్డింగ్‌ గౌన్స్‌ రెంటల్‌ బాల్‌ గౌన్లు, లెహంగాలు, శెర్వానీలు అందిస్తుంది. ఇక మగవాళ్ల దుస్తులకు ప్రత్యేకించిన కేపీహెచ్‌బీ ప్రాంతంలోని స్టైల్‌ హిమ్‌లో బ్లేజర్లు, శెర్వానీలు అందుబాటులో ఉన్నాయి. 

అలాగే ఫ్లైరోబ్‌ సంస్థ శెర్వానీలు, జోద్‌పురి సూట్లు, నెహ్రూ జాకెట్లు, పాశ్చాత్య దుస్తులు అందిస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ నుంచి ఆల్టరేషన్స్‌ దాకా ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. అలాగే కస్టమ్‌ ఫిట్టింగ్, హోమ్‌ డెలివరీ. హైజీన్‌ గ్యారెంటీ, డిపాజిట్‌ రిఫండబుల్‌.. ఆఫర్‌ చేస్తున్నాయి. 

(చదవండి: నందిని గెలిస్తే..నంబర్‌ వన్‌ మనమే..! అత్యధిక టైటిల్స్‌ గెలిచిన ఏకైక దేశంగా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement