source: X
వియత్నాంలో జరిగిన మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫినాలేలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెయిరీ మోలా విజేతగా నిలిచారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ ఒపల్ సుచాటా చువాంగ్‌స్రీ ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం అలంకరించారు.
ఈ పోటీలో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేయ్నెస్ ఫస్ట్ రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
టాప్ 6 ఫైనలిస్టులు
డొమినికన్ రిపబ్లిక్ – జోహెయిరీ మోలా: విజేత
స్పెయిన్ – ఎలిసబెత్ రేయ్నెస్: ఫస్ట్ రన్నరప్
మలేషియా – తానుసియా చెట్టి: సెకండ్ రన్నరప్
వియత్నాం – లే న్గుయెన్ బావో న్గోక్
దక్షిణాఫ్రికా – రొమాండా హోంబిర్
ఎరిట్రియా – స్నిట్ హబ్టియాబ్: పీపుల్స్ ఛాయిస్
భారత్‌కు నిరాశ
భారత్ తరఫున పాల్గొన్న నిఖిత పోర్వాల్ టాప్ 40లో చోటు దక్కించుకున్నప్పటికీ, టాప్ 20కి అర్హత సాధించలేకపోయారు. దీంతో ఆమె మిస్ వరల్డ్ 2026 ప్రయాణం టాప్ 40 వద్ద ముగిసింది. అయితే భారత్ వరుసగా ఐదు మిస్ వరల్డ్ ఎడిషన్లలో ప్లేస్‌మెంట్ సాధించిన రికార్డును కొనసాగించింది.


