
గ్లోబల్ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు.. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం, విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు నగరానికి వచి్చన విషయం విధితమే. ఈ ప్రయాణంలో అందాల తారలు నగరానికి ముగ్దులైపోతున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు.. కానీ ఈ మిస్‌ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. ఈ నేపథ్యంలో పలువురు మిస్‌వరల్డ్ పోటీదారులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు..
బెల్జియం చాక్లెట్లు మావే..
వచి్చనప్పటి నుంచి చూస్తున్నా.. ఎంతో ఆతీ్మయత, ప్రేమ నింపుకున్న మనుషులు మీరంతా..?! నాకు చాలా సంతోషంగా అనిపించింది. అధునాతన జీవన విధానం బాగా నచ్చింది. దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోంది. మిస్ వరల్డ్ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించాను.. ఎంత అందమైన నగరమో. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను చూశాను. ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక మా దేశమే. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడం మరచిపోలేని అనుభూతి.
– కారెన్ జాన్సెన్, మిస్ బెల్జియం
అమ్మా నాన్నలను తీసుకొస్తా..
ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్ వరల్డ్ బృందంతో పాటు అవన్నీ సందర్శించాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడటానికి మళ్లీ హైదరాబాద్ వస్తా. వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నా ఫేవరెట్ డెస్టినేషన్ నగరాల్లో హైదరాబాద్ కూడా చేరింది. నగరం చూట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచి్చంది.
– ఎమ్మా మోరిసన్, మిస్ కెనెడా
మరో ఇల్లులా అనిపించింది..
భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ తారసపడ్డాయి. ఈ వైవిధ్యాన్ని చూడటానికి భారత్ మొత్తం తిరగాల్సిన పనిలేదు. కేవలం హైదరాబాద్ వస్తే చాలు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాక్ వెళితే మరోలా.., ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్‌కతా (బెంగాల్) వెళితే మా బంగ్లాదేశ్ మూలాలు కనిపిస్తాయి. ఇవన్నీ హైదరాబాద్‌లో చూశా. ఇది ఒక మినీ ఇండియా. నాకైతే హైదరాబాద్ మరో ఇల్లులా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మీయ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. నాకు నచి్చన స్పైసీ ఫుడ్ లభిస్తుంది. వారసత్వ వంటకాలు బాగున్నాయి. నేను తిన్న కొబ్బరి చట్నీ అయితే సూపర్బ్.
– అక్లిమా అతికా కొనికా, మిస్ బంగ్లాదేశ్
అమ్మాయిలకు అనువైన నగరం..
ఇక్కడి అమ్మాయిలను చూస్తే సంతోషంగా ఉంది. వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. మా దేశం జింబాబ్వే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం.. అంతర్జాతీయంగా ఫ్యాషన్ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్ల డిజైనింగ్ ఇక్కడ చూసి సంతోషం అనిపించింది. ఒక మోడల్‌గా గర్వపడుతున్నా. విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెడ్‌గా మారుతోంది. మేమంతా వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలుగా మాకు వేర్వేరు నమ్మకాలున్నాయి. కానీ ఇక్కడి సంస్కృతిక సమ్మేళనం, వైవిధ్యం ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమాంతర వ్యవస్థ ఉండటం అద్భుతం. రంగు, రూపం వంటి అంశాలతో భిన్నంగా ఉన్న స్త్రీలను ఈ వైవిధ్యం విజేతను చేస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది.
–కోర్ట్నీ జాంగ్వే, మిస్ జింబాబ్వే
మొదటి సారి పానీ పూరీ తిన్నా..
వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పానీ పూరీ గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆ్రస్టేలియా వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్ వచ్చాకే పానీ పూరీ మొదటి సారి తిన్నా. వీటి రుచిని మాటల్లో చెప్పలేను. మొదట్లో వీటిని సరిగా తినలేకపోయాను. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీపూరీ ఎలా తినాలో చూపించింది.. అప్పటి నుండి తినడం అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్ అనగానే మొదట పానీపూరీనే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఆతీ్మయంగా పలుకరిస్తారు. నేను బసచేసే హోటల్ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపిస్తోంది. చారి్మనార్ వీధుల్లో కొన్న వస్తువులు వియాత్నాం తీసుకెళతాను. ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం నాకెంతో నచి్చంది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి.
– హూన్ త్రాన్ నీ, మిస్ వియాత్నాం