సాక్షి హైదరాబాద్: దుండిగల్ బౌరంపేటలో దారుణం జరిగింది. ఓ కసాయి తల్లి అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. 2 నెలల పసికందుని అదేపనిగా ఏడుస్తున్నాడనే కోపంతో కట్టెలపొయ్యిలో వేసింది. దీంతో అపం శుభం తెలియని ఆ పసికందు అగ్నికి ఆహుతయ్యాడు. పసికందు ఏడిస్తే నలుగురికి తెలుస్తోందనే కారణంతో అతని నోట్లో గుడ్డలు నొక్కినట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


