సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. హరీష్ రావు స్వార్థం పరాకాష్టకు చేరింది. తెలంగాణలో వర్షాలు పండకూడదని, పంటలు పండకూడదని హరీష్ రావు కుట్రలు చేస్తున్నారు. కరువుతో ప్రజలు అల్లాడిపోవాలని హరీష్ రావు కుతంత్రాలకు పాల్పడుతున్నారు.
హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి ఉదాహరణలు ఉన్నాయి. తమిళనాడు తిరుచ్చారాపల్లి, శివ మొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయి. మేము చెప్పిన డేట్ ప్రకారం హరీష్ ఎక్కడ ఉన్నారో మీడియాకి సమాధానం చెప్పాలి. అరుదంతి సినిమాలో పశుపతి మాదిరి హరీష్ వ్యవహారం ఉంది’అని దుయ్యబట్టారు.


