ప్రకాశం: విద్యాశాఖ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించింది మాత్రం ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పట్టించుకున్నంతగా విద్యాశాఖని ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదన్నారు. అందుకే వైఎస్ జగన్ పాలనలో విద్యా దీవెన, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లతో పాటు పోషక ఆహారం కోసం మెనూ రూపొందించి అమలు చేశారన్నారు. ఇప్పటి విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌కి ఇవేమీ తెలియదని, కానీ సకల శాఖలో మంత్రిగా ఉంటారని ఎద్దేవా చేశారు.
బోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభంలో పరిశ్రమ శాఖ మంత్రి భరత్ కనపడలేదు... సకల శాఖా మంత్రి లోకేష్ ఉన్నారు. అబద్దాలతో ప్రజలను మోసం చేస్తూ అబ్బాకొడుకులు గిన్నీస్ బుక్ రికార్డులకి ఎక్కారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ గురించి తెలిసే ప్రదానమంత్రి మోదీ కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు ప్రవృత్తి దొంగతనం.
డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. ఒక మాఫియాని లోకేష్ పెంచి పోషించారు. దగా డీఎస్సీలో డిస్ట్రిక్ట్ కమిటీ స్థానం లేదు. అంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగింది. నీట్ పేపర్ లీక్‌పై జెన్ జెడ్ పోరాటంతో ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా తల వంచింది. లోకేష్ కూడా తలవంచక తప్పలేదు. లోకేష్ చదివిన చదువు నిజమే అయితే ఆ చదువులో నిజాయితీ ఉంటే లోకేష్ రాజీనామా చేయాలి. బ్యాక్ డోర్ పాలిటిక్స్ మాత్రమే లోకేష్‌కి తెలుసు. సూట్ కేసు పట్టు.. జాబ్ కొట్టు అనే విధంగా లోకేష్ ప్రవర్తన ఉంది. పేద పిల్లల చదువులకి విలువ లేకుండా చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.


