రాయలసీమ నీటి హక్కుల కోసం.. వైఎస్సార్సీపీ పోరుబాట | YSRCP on the warpath for Rayalaseema water rights | Sakshi
Sakshi News home page

రాయలసీమ నీటి హక్కుల కోసం.. వైఎస్సార్సీపీ పోరుబాట

Aug 4 2026 12:11 PM | Updated on Aug 4 2026 12:46 PM

YSRCP on the warpath for Rayalaseema water rights

సాక్షి, నంద్యాల: రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా ఈ రోజు (మంగళవారం) గోరుకల్లు, ఆవుకు రిజర్వాయర్లను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు.రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించడం ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIP) నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది.

వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ..గోరుకల్లు రిజర్వాయర్‌కు గండి పడితే ప్రభుత్వం ఏం చేస్తుందని టీడీపీ అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్లను గాలికి వదిలేశారని కాటసాని మండిపడ్డారు. చంద్రబాబు వస్తే కరువేనని వర్షాలు పడే అవకాశం ఉండదని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.   ప్రాజెక్టులను నిర్విర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబుకు రైతుల పక్షాన పోరాడిన చరిత్రలేదని రాయలసీమ లిఫ్ట్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని శిల్పారవి పేర్కొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement