breaking news
porubata
-
లోకేశ్ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ పలు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.. YSRCP DSC Porubata Updatesఏపీలో జంగిల్రాజ్వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ యత్నంపోలీసుల సమక్షంలోనే కొనసాగుతున్న దౌర్జన్యకాండవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలుకీలక నేతలు దీక్షా శిబిరాలకు వెళ్లకుండా అడ్డగింతపోలీసుల సమక్షంలోనే దీక్షా టెంట్లను పీకేస్తున్న టీడీపీ శ్రేణులుఅడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులుపలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలువిజయవాడలో అమానుషం.. అత్యంత నీచంగా వ్యవహరించిన బోండా ఉమా అనుచరులుదీక్షా శిబిరం పైనుంచి మూత్రం పోసిన బోండా అనుచరుడుమహిళలపై సైతం దాడులకు పాల్పడుతున్న టీడీపీ రౌడీలుబోండా ఉమా దౌర్జన్యం.. దాడికి యత్నండీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ముత్యాలపాడులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు గుడ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు తొలగించారు. జేసీ వర్గీయుల కవ్వింపు చర్యలతో పాటు దౌర్జన్యం జరిగిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ ఘటనను వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.ఏలూరు జిల్లాలో.. డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కైకలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన దీక్షలకు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పులివెందులలో.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షలో కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులకు పూలమాలలు వేసి పార్టీ నేత వైఎస్ మధురెడ్డి దీక్షలను ప్రారంభించారు.రేపల్లెలో ఉద్రిక్తత..డీఎస్సీ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె తాలూకా సెంటర్లో వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీటా మోహన్‌కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అనంతపురం జిల్లాలో.. మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.శ్రీ సత్యసాయి జిల్లాలో..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో జెన్‌జీ నిరసనలుతిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..2025లో జరిగిన డీఎస్సీ అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరం మండలానికి చెందిన విద్యార్థులు దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు.. నేటి నుండి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలురాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాలు సమావేశాలుఈరోజు నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలుప్రభుత్వం స్పందించకుంటే 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు నిర్ణయంనంద్యాల జిల్లాలో.. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు.నెల్లూరు జిల్లాలో..కోవూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు రజిత్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని కోరారు.తిరుపతిలో భూమన నేతృత్వంలో దీక్షలు..మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నిరుద్యోగులు, పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గురజాలలో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్లో రిలే దీక్ష దీక్షకు సిద్ధమైన వైఎస్సార్సీపీ యువజన విద్యార్థి విభాగందీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులుకనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులుదీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులుబాపట్ల జిల్లా వేమూరులో.. అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులుదీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులుఅడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తతమాచర్లలో దీక్షకు అడ్డంకులుపల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.గుంటూరులో టెంట్ తొలగింపుగుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు. కనిగిరిలోనూ ఉద్రిక్తతమార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్‌జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి ధద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రణభేరిడీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
రాయలసీమ నీటి హక్కుల కోసం.. వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి, నంద్యాల: రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనలో భాగంగా ఈ రోజు (మంగళవారం) గోరుకల్లు, ఆవుకు రిజర్వాయర్లను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు.రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించడం ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIP) నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది.వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ..గోరుకల్లు రిజర్వాయర్‌కు గండి పడితే ప్రభుత్వం ఏం చేస్తుందని టీడీపీ అధికారంలోకి వచ్చాక రిజర్వాయర్లను గాలికి వదిలేశారని కాటసాని మండిపడ్డారు. చంద్రబాబు వస్తే కరువేనని వర్షాలు పడే అవకాశం ఉండదని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ప్రాజెక్టులను నిర్విర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబుకు రైతుల పక్షాన పోరాడిన చరిత్రలేదని రాయలసీమ లిఫ్ట్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టారని శిల్పారవి పేర్కొన్నారు. -
‘రాయలసీమ లిప్ట్’ కోసం వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. న్యామద్దెల గ్రామం నుంచి హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ దాకా వైఎస్సార్సీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. హంద్రీనీవా కాలువ వద్ద రైతులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.తాను చెబితేనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పాదయాత్రలో మాజీ మంత్రులు ఉషాశ్రీచరణ్, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, కదిరి సమన్వయకర్త మక్బూల్ పాల్గొన్నారు. -
ఇంకెంత పెరగాలి బాబుగారూ?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ98.63, డీజిల్ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ111.36(హైదరాబాద్), డీజిల్ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్ రూ.104.66, డీజిల్ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్‌కు సూచిస్తున్నారు.తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్‌కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్ ₹112.96, డీజిల్ ₹100.32 -
ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని YSRCP నిర్ణయం
-
నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ పోరుబాట
-
నకిలీ మద్యంపై ఏపీవ్యాప్తంగా YSRCP రణభేరి
నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా.. నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై పలువురు నేతలు ధ్వజమెత్తుతున్నారు. -
విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ ‘పోరుబాట’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.ఈ క్రమంలో.. ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాట(Porubata)కు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది. త్వరలో ఈ పోరుబాటకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయనుంది.ఒకవైపు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒకదఫా ఫీజు బకాయిలను కూడా చంద్రబాబు సర్కార్ చెల్లించలేదు. మరోవైపు..ఫీజులు చెల్లించలేదని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత విద్యార్థులకు అండగా పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి -
జగన్ వరుస నిర్ణయాలతో వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం
గుంటూరు, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్సార్సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.వైఎస్సార్సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్(YS Jagan) విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution), కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు కూడా. అలాంటి వాళ్లకే పదవులువైఎస్సార్సీపీ(YSRCP)లో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. మండల్, బూత్ లెవల్ నియామకాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అయితే.. త్వరలో వైఎస్ జగన్ కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్ జగన్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో.. వాళ్లకే పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌ను చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు.. స్వయంగా తానే కార్యకర్తల దగ్గరకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు.. పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది. పోరుబాటలో YSRCP..ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేడర్‌కు గుర్తు చేస్తున్నారు.ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది. మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది. -
వైఎస్సార్సీపీ నేతల పోరుబాటపై పోలీసుల అక్రమ కేసులు
-
ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతంకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపుఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలుప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటంజనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు -
YS Jagan: ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణబాబు సర్కార్‌కు డిమాండ్లురూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణడిసెంబర్ 27వ తేదీన.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమంబాబు సర్కార్‌కు డిమాండ్లుకరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలిజనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి ఇదీ చదవండి: ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు- వైఎస్ జగన్ -
నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
-
పోరుబాట ఉద్రిక్తం.. నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అనంతపురం: కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు నిర్భంధించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను తమ నిర్భందంలో ఉంచుకున్న పోలీసులు.. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
సమస్యల పరిష్కరానికి ప్రభుత్వంపై పోరుబాట
అనంతపురం అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరుబాట తప్పదని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. ఇందుకు ఉద్యోగులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ట్రెజరీ హోమ్‌లో ఏపీ హంస (హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా నూతన కార్యవర్గం ఆవిర్భావ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షురాలు కె.చాముండేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి యోగేశ్వరెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవపాల్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ మహేంద్రకుమార్, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు శీలా జయరామప్ప హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమస్యలపై పోరాటానికి సిద్ధమంటూ నాయకులందరూ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసులు, పబ్లిసిటీ కార్యదర్శి ఈశ్వరయ్య, ముఖ్య సలహాదారు రామకృష్ణారావు, అసోసియేట్ అధ్యక్షుడు రమేశ్, కర్నూలు, కడప జిల్లాల అధ్యక్షులు రఘుబాబు, రాజారావు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హంస జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కె.చాంముండేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా ఎ.రవీంద్ర, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ తిరుపతినాయుడు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరయ్య, పద్మావతి, శిరీష, మేరీ విజయకుమారిని, లక్ష్మిని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా సరస్వతి, నాగేంద్రప్రసాద్, నాగరాజు, నాగమణి, నాగరత్నమ్మ, మేరీసుజాతలను, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహేంద్ర, పబ్లిసిటీ కార్యదర్శిగా కొండా రవిరెడ్డి, కోశాధికారిగా అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులుగా విశ్వనాథ్, సుదర్శన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. -
ప్రజాసమస్యలపై పోరుబాట
అనంతపురం అర్బన్ : ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాట పట్టాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా చేపట్టాలన్నారు. 31న తహశీల్దారు కార్యాలయాల ఎదట ధర్నాలు నిర్వాహించాలన్నారు. ప్రజాందోళనలో ప్రజలను భాగస్వాములన్ని చేయాలని నాయకులకు సూచించారు. బుధవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్లో పార్టీ సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లు గడిచినా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, ఆ వర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సొంత ఇల్లు, పింఛను అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి లింగమయ్య, సహాయ కార్యదర్శి శ్రీరాములు, నాయకులు ఈశ్వరయ్య, రమణప్ప, బిందెల నారాయణస్వామి, మహిళ సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, నగర కార్యదర్శి జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను కలుపుకుని పోరుబాట సాగిస్తామని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్య మోషేన్‌రాజు తెలిపారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 38 మండలాలకు సంబంధించి పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాల కమిటీలను ఎన్నుకుని పార్టీని గ్రామస్థాయి నుంచి మరింతగా బలోపేతం చేయనున్నామన్నారు. టీడీపీ అరాచకాలను, అన్యాయాలను ప్రజలకు వివరించడానికే మండలాల వారీగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. మండల కమిటీలో పనిచేసేందుకు కార్యకర్తలకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తేనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ అనుబంధ విభాగాల మండల కమిటీ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. పార్టీ యువజన, రైతు, మహిళా, విద్యార్థి విభాగాలకు కమిటీలు ఎంపిక చేసిన అనుబంధ విభాగాలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాగి దుర్గాప్రసాదరాజు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పాల్గొన్నారు. -
ఐక్యంగా పోరుబాట సాగిద్దాం
ప్రజా ఉద్యమకారులకు విమలక్క పిలుపు కాకినాడలో విప్లవవీరుల సంస్మరణ సభ అలరించిన ‘అరుణోదయ’ సాంస్కృతిక ప్రదర్శనలు కాకినాడ సిటీ : అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా ఉద్యమకారులంతా ఏకమై పోరాడాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో స్థానిక సూర్యకళా మందిరంలో గురువారం విప్లవ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ ఒక మందిరంలో జరిగే సమావేశానికి కూడా అనుమతి తీసుకోవాలనడం ఎక్కడా చూడలేదన్నారు. ఈ సంస్మరణ సభకు చివరి వరకూ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. భారత విప్లవోద్యమ చరిత్రలో నవంబర్ నెల ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకుని శ్రీకాకుళం రైతాంగ మేఘగర్జన వరకూ ఎంతోమంది విప్లవ వీరులు నవంబర్ బూటకపు ఎన్కౌంటర్లలోనే నేలకొరిగారని ఆమె గుర్తుచేశారు. పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారులను అక్రమ అరెస్టులతో నిర్బంధిస్తూ, ప్రజా ఉద్యమాలను విచ్ఛిన్నం చేయాలని పాలకులు చూస్తున్నాయన్నారు. మట్టి మాఫియా : కర్నాకుల ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ హోం శాఖామంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలంలో మట్టి మాఫియా పడగ విప్పిందన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఎన్టీ రామారావు తెలుగు మాగాణి సమారాధన పథకంలో కేటాయించిన రామేశంపేట ఎర్రమట్టి కొండల నుంచి తెలుగు తమ్ముళ్లు, మంత్రి అనుచరులు అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మరోపక్క తొండంగి మండలంలో పర్యావరణానికి ముప్పు కలిగించే దివీస్ ఫార్మా కంపెనీకి 550 ఎకరాల భూమిని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ముందుగా సభలో విప్లవ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కె.రామలింగేశ్వరరావు, బి.రమేష్ పాల్గొన్నారు. -
సాగునీటి కోసం పోరుబాట
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి గార్లదిన్నె : మిడ్ పెన్నార్ (ఎంపీఆర్) డ్యాం కింద ఉన్న ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం సాగునీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమైంది. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు రాకపోవడంతో శింగనమల నియోజక వర్గంలోని గార్లదిన్నె, శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే మిడ్ పెన్నార్ డ్యాంలో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం అధికార బలం ఉన్నవాళ్లే నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్నే ప్రభుత్వ విప్ యామినీబాల పబ్లిక్ సమావేశాల్లో బలమున్న వాళ్లే నీరు తీసుకొనిపోతున్నారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయకట్టు రైతుల బాధ అధికార పార్టీ నేతలకు పట్టడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడి,్డ అనంతపురము మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సుబ్బిరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి నరేంద్రరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమణరెడ్డి,కొండూరు కేశవరెడ్డి, జంబులదిన్నె సొసైటీ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, బండిఆంజనేయులు, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల పోరుబాట
‘హైపవర్’ వేతనాల కోసం డిమాండ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మిక మహిళలు గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2013లో జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ కమిటీ (హెచ్పీసీ) వేతనాల కోసం ఇక పెద్ద ఎత్తున ఉద్యమం సాగనున్నారు. అన్ని ఏరియాలలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతృత్వంలో పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం ఇటీవల కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోగా...ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేయూ, ఐఎన్టీయూసీ, బీఐటీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీవీ సంఘాల ఆధ్వర్యంలోని కాంట్రాక్టు కార్మిక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాలుగా హైపర్ కమిటీ వేతనాలు, బోనస్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలోని జీఎం కార్యాలయాల ఎదుట దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంట్రాక్టు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇవీ డిమాండ్లు.... సకలజనుల సమ్మె వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల. ఎన్సీడబ్ల్యూయూ–9లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, అలవెన్స్‌లు, సౌకర్యాలను నిర్ణయించి అమలు చేయాలి. సింగరేణిలో సీఐఎల్ ఆదేశాల ప్రకారం 8.33 శాతం బోనస్‌ను అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలి. ఓబీ డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలి. ఇతర విభాగాల వారిని సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి. సెలవులు, బట్టలు, విద్య, వైద్యం, రక్షణ, నష్టపరిహారం చర్యలు, సౌకర్యాలను అమలు చేయాలి. చట్టబద్ద హక్కులను అమలు చేయాలి. సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్లను వెంటనే కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్‌ను వర్తింపజేయాలి. సింగరేణి లాభాలలో ఇస్తున్న బోనస్‌ను పర్మినెంట్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. -
రజకులు పోరుబాట పట్టాలి
– రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పిలుపు కడప రూరల్ : రాష్ట్రంలోని రజకులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని రజక అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.అంజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో మినహా అన్ని రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ చంద్రబాబును, ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం నగరంలోని స్కౌట్ హాలులో జిల్లా రజక మహాసభను ఆ సంఘం జిల్లా అ«ధ్యక్షులు సి.వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మునెయ్య, పి.పార్వతి, పి.కమ్మన్న, పెద్ద సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. -
వంద శాతం వైకల్యమున్నా పింఛన్ ఇవ్వరా?
‘సార్.. నా భర్త చనిపోయిండు. 19 ఏళ్ల బిడ్డ వికలాంగురాలు. నెలకు ఐదువందల పింఛన్ వచ్చేది. ఆ పింఛన్ సైతం తీసేస్తే ఎట్ల బతుకుతం. మేమేమన్న ఉన్నోళ్లమా. మేమేం పాపం చేసినం చెప్పండి..’ అంటూ హుస్నాబాద్‌కు చెందిన కంసాని అనసూర్య నగరపంచాయతీ కమిషనర్ మార్క సుధాకర్‌ను ప్రశ్నించారు. వంద శాతం వైకల్యం ఉన్న తన బిడ్డను రోడ్డుపై ఉంచి.. ‘ఈమె వికలాంగురాలు కాదా? ఇలాంటి వాళ్లకు పింఛన్ ఇయ్యరా. చెప్పండి సార్’ అంటూ నిలదీసింది. ఇలాగే హుస్నాబాద్ నగరపంచాయతీ ఎదుట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సైతం భారీగా ఆందోళనకు దిగారు. వంటావార్పు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. - హుస్నాబాద్ హుస్నాబాద్ : పింఛన్‌కోసం పేదలు పోరుబాట పట్టారు. ఇన్నాళ్లూ అందుతున్న పింఛన్లను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. వితంతువులకూ అన్యాయం చేసిన కేసీఆర్‌కు తమ ఉసురు తగులుతుందంటూ ఆయన చిత్రపటాన్ని చెప్పులతో దండించారు. హుస్నాబాద్ నగరపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేసేవరకూ కదిలేది లేదంటూ అక్కడే వంటావార్పు చేశారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ నాయకులు మద్దతు పలికారు. హుస్నాబాద్‌లో గతంలో 1,735 మందికి పింఛన్లు అందేవి. కొత్తగా 2,810 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 849మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించి పింఛన్లు ఇచ్చారు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళనకు దిగారు. నగర పంచాయతీ కార్యాలయంలోని జాబితాలో పేర్లు లేకపోవడంతో రహదారిపై బైఠాయించారు. చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం తమకు అన్యాయం ఎందుకు చేశారో చెప్పాలం టూ చైర్మన్ సుద్దాల చంద్రయ్య చాంబర్లోకి చొచ్చుకెళ్లారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్నామని, అయినా తొలగించారని ఆగ్రహం వ్యక్తంచే శారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా వారు ససేమిరా అన్నారు. పింఛన్ తొలగించినోళ్లకు తమ ఉసురుతగులుతుందంటూ పాటలుపాడారు. సీఎం కేసీఆర్, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నగర పంచాయతీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదుట వంటావార్పు తమకు న్యాయం చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేదిలేదంటూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనాలు చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, బొలిశెట్టి శివయ్య, గురాల లింగారెడ్డి, బొల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, మైదంశెట్టి వీరన్న, వార్డు కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, దండి లక్ష్మి, వాల సుప్రజ, పచ్చిమట్ల ప్రతిభ, చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, బీజేపీ నాయకులు వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, వరయోగుల అనంతస్వామి, కందుకూరి సతీష్, సీపీఐ నాయకులు కొయ్యడ సృజన్‌కుమార్, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు బోజు రవీందర్ మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. చైర్మన్ సుద్దాల చంద్రయ్య వచ్చి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అంతకుముందు పట్టణంలోని నాలుగో వార్డులో పింఛన్ల పంపిణీ కేంద్రం వద్ద అధికారులను నిర్బంధించారు. పింఛన్ల పంపిణీలో నిరసనలు పింఛన్లు ఇస్తే అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లెలో స్థానికుడు కరివేద భూంరెడ్డి గ్రామ పంచాయతీకి తాళం వేశాడు. నేదునూర్, గొల్లపల్లి, వచ్చునూర్లో సైతం కొందరు అధికారులను ప్రశ్నించారు. అర్హుల జాబితా నుంచి తమ పేర్లు తొలగించడంపై రామగుండం మండలం బసంత్ నగర్ పరిధిలోని పాలకుర్తిలో 50 మంది వృద్ధులు గ్రామ పంచాయతీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. రాయికల్ మండలంలోని భూపతిపూర్‌లో పింఛన్ల పంపిణీకి వెళ్లిన ఎంపీడీవో గీతను వృద్ధులు అడ్డుకున్నారు. చొప్పదండి మండలంలోని పెద్దకూర్మపల్లిలో పింఛన్ల పంపిణీని గ్రామస్తులు అడ్డుకున్నారు. 47 మంది పింఛన్‌కు అర్హులని జాబితా విడుదల చేయగా నలుగురే లబ్ధిదారులని చెప్పడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పంపిణీ చేయకుండానే అధికారులు వెనక్కిమళ్లారు. -
ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'పోరుబాట' ధర్నాలు బుధవారం విజయవంతం అయ్యాయని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నివర్గాలనుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారని ఆయన ఎద్దేవా చేశారు. 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రజా ద్రోహానికి పాల్పడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజాగ్రహానికి గురికావద్దని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
కల్లబొల్లి మాటలతో చంద్రబాబు మోసం: శ్రీకాంత్ రెడ్డి
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా రైతు రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఐదు సంవత్సరాలు పూర్తయినా.. రుణమాఫీ సాధ్యం కాదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అబద్దపు మాటలతో కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
అధికారమే లక్ష్యంగా పోరుబాట
ఓట్లు మావే.. సీట్లు మావే నినాదంతో ముందుకు సాగాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పీలేరు, న్యూస్‌లైన్: అధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు పోరుబాట పట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. పీలేరు పట్టణంలోని వేర్‌హౌస్ గోడౌన్ ఆవరణలో సోమవారం బహుజనుల సమరభేరి బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓటు అంటే తెల్లకాగితం కాదని, ఓటంటే ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి సమానమైనదని తెలిపారు. రాజ్యాధికారం ఏ కులం చేతిలో ఉంటే ఆ కులానికి గుర్తింపు, గౌర వం ఉంటుందని తెలిపారు. అణగారిన వర్గాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే నాలుగు స్తంభాలపై పార్లమెంట్ నిలబడి ఉందని అంబేద్కర్ తెలిపారన్నారు. బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఒక గ్రంథం రాసినా ముగింపు ఉండదన్నారు. ఒకట్రెండు శాతాలు ఉన్న వారే ప్రధాని, ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పారు. దాదాపు 90 శాతం పైగా ఉన్న బహుజనులను భిక్షగాళ్లుగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాదరణను గుర్తించి రాజ్యాధికారమే లక్ష్యంగా అందరం పోరుబాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారం శివాజీ మాట్లాడుతూ ప్రజల సుఖ సంతోషాలను రాజ్యాంగం ఆశిస్తోందని, పాలక వర్గాలు ఆకలి, అశాంతి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం పెంచేటట్లు చేస్తున్నాయని ఆరోపించారు. యమలా సుదర్శన్, భాస్కర్‌యాదవ్, పీటీఎం శివప్రసాద్, చమన్, విజయలక్ష్మీ, డాక్టర్ ఇక్బాల్, చింతగింజల శ్రీరామ్ తదితరులు కూడా ప్రసంగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు హాజరయ్యారు. పీలేరు పట్టణంలో ఆటోలతో ర్యాలీ, ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్రాస్ రోడ్డు వరకు కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించార.


