Live Updates

నకిలీ మద్యంపై ఏపీవ్యాప్తంగా YSRCP రణభేరి
అవనిగడ్డ నియోజకవర్గంలో..
- కృష్ణాజిల్లా అవనిగడ్డ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద వైసీపీ నిరసన కార్యక్రమం
- కల్తీ మద్యం కుటీర పరిశ్రమలను అరికట్టాలని ఎక్సైజ్ సీఐ గిరిజా కుమారికి వినతి పత్రం అందజేత
- పాల్గొన్న అవనిగడ్డ జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, సింహాద్రి వెంకటేశ్వరరావు తదితరులు
2025-10-13 12:49:08
పెడన నియోజకవర్గంలో..
- కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో నకిలీ మద్యంపై పోరు
- వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి తాసీల్దార్ కార్యాలయం దాకా ర్యాలీ
- నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక ఆధ్వర్యంలో నిరసనలు
- నకిలీ మద్యాన్ని అరికట్టాలని భారీగా నినాదాలు
- తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
2025-10-13 12:49:08
చంద్రగిరిలో..
- నకిలీ మద్యం అరికట్టాలని చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ
- చంద్రగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహణ
- సీఐకు వినతిపత్రం సమర్పించిన నియోజకవర్గ ఇంఛార్జి మోహిత్ రెడ్డి
- నకిలీ మద్యం బెల్ట్ షాపులు లేవని టీడీపీ చెప్పడం హాస్యాస్పదం :మోహిత్ రెడ్డి
- నకిలీ మద్యం, బెల్ట్ షాపులు అరికట్టాలి :మోహిత్ రెడ్డి
- ఆలయాలు, పాఠశాలల వద్ద వైన్ షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయి:మోహిత్ రెడ్డి
- వెంటనే అరికట్టాలని లేకపోతే ఉద్యమిస్తాం: మోహిత్ రెడ్డి
2025-10-13 12:49:08
జోరు వానలో కూడా ఆగని పోరుబాట
- కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ పోరుబాట
- జోరు వానలో కూడా ఆగని ‘కల్తీ మద్యం’ నిరసనలు
- నకిలీ మద్యం నిందితులను అరెస్ట్ చేయాలని ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేత
- పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
- నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి:చక్రవర్తి
- రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది:చక్రవర్తి
- నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది:చక్రవర్తి
- నకిలీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? :చక్రవర్తి
- నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలి :చక్రవర్తి
- ఎక్సైజ్ శాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలి :చక్రవర్తి
- ఎన్ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేయాలి:చక్రవర్తి
- నకిలీ మద్యం బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి:చక్రవర్తి
2025-10-13 12:49:08
కుప్పంలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ..
- చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ మద్యంపై నిరసన ర్యాలీ
- కల్తీ మద్యంను అరికట్టాలని కుప్పం ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్సీ భరత్
- రాష్ట్రంలో కుటీర పరిశ్రమలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు :భరత్
- కల్తీ మద్యం విక్రయిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలి :భరత్
- సీబీఐ విచారణ జరిపించాలి:భరత్
2025-10-13 12:49:08
రాజమండ్రి రామాలయం సెంటర్లో భారీ మానవహారం
- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ
- కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ పార్టీ రాజమండ్రి కోఆర్డినేటర్ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఆందోళన
- రామాలయం సెంటర్లో భారీ మానవహారం
- పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు
- కల్తీ మద్యాన్ని నిషేధించాలంటూ నినాదాలు
2025-10-13 12:49:08
రైల్వే కోడూరులో..
- అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నకిలీ మద్యం పై మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా
- కూటమి ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావొస్తుంది : మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- కల్తీ మద్యం తాగి 763 మంది మృతి చెందారు: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అక్రమ సంపాదనే ముఖ్యం లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుండి కల్తీ మద్యం ద్వారా రూ.5, 600 కోట్లు లబ్ధి పొందిన తెలుగు తమ్ముళ్లు: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- ప్రభుత్వం ఆధీనంలో సిట్టు ఉంటుంది కనుక అధికార పార్టీకి వత్తాసు పలుకుతుంది: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- ఈ నకిలీ మద్యం కేసు సిపిఐ కి అప్పజెప్పాలి: మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
2025-10-13 12:49:08
శ్రీకాళహస్తిలో..
- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నకిలీ మద్యంపై గళమెత్తిన మహిళలు
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో భారీ ఎత్తున నిరసన
- శ్రీకాళహస్తి వైసీపీ ఆఫీసు నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ
- ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలకమండలి మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, నాలుగు మండలాల వైసీపీ అధ్యక్షులు
2025-10-13 12:49:08
ఆలూరులో..
- కర్నూలు జిల్లా ఆలూరులో కల్తీ మద్యంపై ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా
- రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంది: ఎమ్మెల్యే విరుపాక్షి
- కల్తీ మద్యం కేసును సిట్ కాకుండా సీబీఐకి అప్పగించాలి : ఎమ్మెల్యే విరుపాక్షి
- రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలి: ఎమ్మెల్యే విరుపాక్షి
- ప్రజలు ప్రాణాలు కాపాడాలి: ఎమ్మెల్యే విరుపాక్షి
2025-10-13 12:32:54
మైదుకూరులో కల్తీ మద్యంపై నిరసనలు
- వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కల్తీ మద్యంపై మహిళల నిరసన ర్యాలీ
- వందలాదిగా పాల్గొన్న మహిళలు
- ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా.
- కల్తీ మద్యం తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మహిళలు
2025-10-13 12:32:54
నాయుడుపేటలో..
- తిరుపతి జిల్లా నాయుడుపేటలో కల్తీ మద్యం పై గళమెత్తిన మహిళా లోకం
- కల్తీ మద్యంపై నాయుడుపేటలో నిరసన ర్యాలీలు
- నాయుడుపేట ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు
- కల్తీ మద్యం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు
- కూటమి ప్రభుత్వానికి దమ్ము దైర్యం ఉంటే విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్
- ఎక్సైజ్ అధికారులకు మహిళలతో కలిసి వినతి పత్రం అందచేసిన సూళ్లూరుపేట మాజీ ఎంఎల్ఏ, ఇంచార్జ్ కిలివేటి సంజీవయ్య
2025-10-13 11:54:07
రాజంపేటలో నారాసుర కల్తీ మద్యం వద్దంటూ..

- అన్నమయ్య రాజంపేటలో కల్తీ మద్యంపై పోరుబాట
- నారాసుర కల్తీ మద్యం వద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు అంటూ కదం తొక్కిన మహిళలు
- రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి రెడ్డి నేతృత్వంలో కల్తీ మద్యంపై కొనసాగిన నిరసన
- రాజంపేట ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్దయెత్తున నిరసనలో పాల్గొన్న మహిళలు...

- బెల్టు షాపులు, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని వైసీపీ మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేత
- కల్తీ మద్యం నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి
2025-10-13 11:54:07
నారావారి సారాపాలన.. నశించాలి: ఆర్కే రోజా

- చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యంపై వైఎస్సార్‌సీపీ పోరు
- నగరి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు
- మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- నకిలీ మద్యం నియంత్రించాలని, కల్తీ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని రోజా డిమాండ్
2025-10-13 11:54:07
మా హయాంలో మద్యాన్ని కంట్రోల్ చేశాం: దేవినేని అవినాష్

- విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళనలు
- ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ ఆధ్వర్యంలో నిరసన
- ఈరోజు కూటమి ప్రభుత్వం లో అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతోంది:అవినాష్
- చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకుడు జయచంద్ర, అతని అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారు:అవినాష్
- శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు నకిలీ మద్యం తయారీ చేస్తున్నారు:అవినాష్
- టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారీ చేసి.. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు:అవినాష్
- మీ డబ్బులు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు:అవినాష్
- ఎల్లో మీడియా ఈ నకిలీ మద్యం మకిలి వైఎస్సార్సీపీ పార్టీ కి పులమల్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు:అవినాష్
- మా హయాంలో నకిలీ మద్యం తయారు చెయ్యలేదు:అవినాష్
- మహిళలకి మాట ఇచ్చి మద్యాన్ని కంట్రోల్ చేశాం:అవినాష్
- నాణ్యమైన మందు అని చెప్పి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు:అవినాష్
- నకిలీ మద్యం తయారీ కి బ్య్యాక్ గ్రౌండ్ చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ నాయకులే:అవినాష్
- వాళ్ళకి అనుకూలమైన అధికారులు ను పెట్టీ సిట్ దర్యాప్తు అంటున్నారు:అవినాష్
- కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వెయ్యండి:అవినాష్
2025-10-13 11:54:07
అనంతలో కదం తొక్కిన..

- అనంతపురంలో కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
- కల్తీ మద్యం అరికట్టాలంటూ ఆందోళన
- వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ డీసీ కార్యాలయం దాకా భారీ ర్యాలీ
- చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు
- టీడీపీ మద్యం మాఫియా నశించాలంటూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల నినాదాలు
- పాల్గొన్న ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ
2025-10-13 11:45:27
వెంకటగిరిలో..
- కల్తీ మద్యం పై గళమెత్తిన తిరుపతి జిల్లా వెంకటగిరి మహిళా లోకం
- కల్తీ మద్యంపై నియోజకవర్గంలో మహిళల నిరసన
- వెంకటగిరి ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు
- కల్తీ మద్యం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు
- ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించిన నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత
2025-10-13 11:45:27
సర్వేపల్లి నియోజకవర్గంలో..
- నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కల్తీ మధ్యం పై వైసీపీ నిరసన
- బెల్ట్ షాప్‌లు అరికట్టాలని వెంకటాచలంలో ర్యాలీ
- డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందించిన ఐదు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు
2025-10-13 11:42:50
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు: ఆంక్షలను లెక్కచేయకుండా..
- కల్తీ మద్యానికి వ్యతిరేకంగా తిరువూరులో కథం తొక్కిన వైసీపీ మహిళా కార్యకర్తలు
- వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీసు వరకూ భారీ ర్యాలీ
- ర్యాలీకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు
- ఓ వైపు పోలీసుల ఆంక్షలు ,మరోవైపు వర్షం కురుస్తున్నా వెనకడుగు వేయని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
- భారీగా ఎక్సైజ్ కార్యాలయానికి తరలివచ్చిన వైనం
2025-10-13 11:42:50
కల్తీ మద్యం.. వైకుంఠ రథంతో ర్యాలీ
- కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా మారడాన్ని నిరసిస్తూ ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ
- వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ
- మున్సిపల్ పార్క్ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకూ ర్యాలీ
- ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేత
- కల్తీ మద్యం తయారీ నమూనాతో ప్రాణాలు తీసేస్తున్నారంటూ వినూత్న నిరసన
- ప్రజల ప్రాణాలను తోడేస్తూ స్మశానాలకు పంపుతున్నారంటూ వైకుంఠ రథంతో ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.. కల్తీ మద్యం రాకెట్‌ను నిర్మూలించాలని డిమాండ్
2025-10-13 11:42:50
విశాఖ బిర్లా జంక్షన్‌లో మానవహారం
- కల్తీ మధ్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఆందోళన
- బిర్లా జంక్షన్ లో మానవహారం నిర్వహించిన వైసీపీ శ్రేణులు
- కల్తీ మధ్యాన్ని అరికట్టాలని నినాదాలు
- కల్తీ మధ్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలి: కేకే రాజు
- రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులు తొలగించాలి: కేకే రాజు
- చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ లోనే కల్తీ మధ్యం వ్యవహారం నడుస్తోంది: కేకే రాజు
- టీడీపీ నేతలే కల్తీ మద్యం నిందితులు: కేకే రాజు
- తక్షణమే నిందితులందరినీ అరెస్ట్ చెయ్యాలి: కేకే రాజు
2025-10-13 11:42:50
కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిందే..
- కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ సీతారామపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన
- నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ రెడ్డి, విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, వికలాంగులు భాగం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
2025-10-13 11:42:50
అందుకే సిట్ వేశారు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
- నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ కార్యాలయం ముందు వైస్సార్‌సీపీ నిరసన
- సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు
- నకిలీ మద్యం కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులు టిడిపి నేతలే:వరుదు కళ్యాణి
- చంద్రబాబు లోకేష్ కనుసనల్లోనే నకిలీ మద్యం కుంభకోణం:వరుదు కళ్యాణి
- టిడిపి నేతల బండారం బయటపడుతుందని సీబీఐ విచారణ జరపలేదు:వరుదు కళ్యాణి
- సిట్ విచారణతో అసలు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు:వరుదు కళ్యాణి
- నకిలీ మద్యంతో ప్రజలు ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు:వరుదు కళ్యాణి
2025-10-13 11:42:50
బద్వేలులో..
- బద్వేలులో సిద్ధవటం రోడ్డు ఎన్జీవో కాలనీ వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ
- ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో కొనసాగిన నిరసనలు
- ఎన్- బ్రాండ్ కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలంటూ నినాదాలు
- ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేత
2025-10-13 11:42:50
విజయవాడలో..
- కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ విజయవాడ భవానిపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన
- నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా , షేక్ ఆసిఫ్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, తదితరులు
2025-10-13 11:42:50
ప్రొద్దుటూరులో..
- వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో కల్తీ మద్యం పై రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు
- గాంధీ పార్క్ నుండి ఎక్సైజ్ కార్యక్రమంలో వరకు ర్యాలీ
- ర్యాలీ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు
2025-10-13 11:42:50
పులివెందులలో..
- పులివెందులలో నకిలీమద్యంపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
- రాష్ట్రంలో నకిలీమద్యం సరఫరా పై నిరసనగా పులివెందులలోని పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ
- ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన
- అనంతరం ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు
2025-10-13 10:49:48
నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు YSRCP పిలుపు
- నకిలీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలిపీఠం మీదకు నెట్టటంపై ఆగ్రహం
- నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమలా మర్చిన చంద్రబాబు సర్కార్
- నకిలీ మద్యం రాకెట్ ను అరెస్టు చేయాలనీ, మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలనే డిమాండ్ తో YSRCP ఆందోళనలు
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నేడు నిరసనలు
2025-10-13 10:49:48
Advertisement