‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎంకు బుద్ధి చెబుతాం’ | Special Prayers by MP Bandi Sanjay at Bhagyalakshmi Temple | Sakshi
Sakshi News home page

‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎంకు బుద్ధి చెబుతాం’

Feb 24 2026 5:07 PM | Updated on Feb 24 2026 5:10 PM

Special Prayers by MP Bandi Sanjay at Bhagyalakshmi Temple

హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. దీనిలో భాగంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారే రక్ష అని అన్నారు. ఆ దేవాలయాన్ని తాము అధికారంలోకి వచ్చాక గోల్డెన్‌ టెంపుల్‌గా  మారుస్తామన్నారు. 

హిందుత్వమే తమ ఎజెండా అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం కోసమే జీహెచ్‌ఎంసీ ముక్కలు చేశారని,.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎంకు బుద్ధి చెబుతామన్నారు. శాంతి భద్రతలు కాపాడాలి... కానీ బాన్సువాడలో ఎంఐఎం ఒత్తిడితో బీజేపీ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలను అరెస్టు చేశారంటూ బండి సంజయ్‌ మండిపడ్డారు.

 

 



 

Advertisement
 
Advertisement
Advertisement