డీజీపీ సమక్షంలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు | DGP Shivadhar Reddy Press Meet On Maoist Surrender | Sakshi
Sakshi News home page

డీజీపీ సమక్షంలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు

Feb 24 2026 3:20 PM | Updated on Feb 24 2026 5:15 PM

DGP Shivadhar Reddy Press Meet On Maoist Surrender

హైదరాబాద్‌: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందనే వార్తలకు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి  ప్రెస్‌మీట్‌ మరింత బలం చేకూరుస్తుంది.  తాజాగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన అంశాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లు మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ పేర్కొన్నారు. దేవ్‌ జీ అలియాస్‌ తిప్పరి తిరుపతి, రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి తదితర మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి బయటకొచ్చారన్నారు.

కాగా, మార్చి నెల మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఆపరేషన్‌ కగార్‌ వంటి ఆపరేషన్లతో కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అడవుల్లో మావోయిస్టులు.. వాటిని వదిలి జనావాసంలోకి వస్తున్నారు.  పలువురు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వంటి చర్యలకు ఎదురెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement