
భారత్‌లో 18 ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్ చికిత్సకు కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించిన జూలియా మార్లీ
త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్న డాక్టర్ రఘురామ్
హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో సేవలందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు సందర్శించారు.
వీరికి కిమ్స్ గ్రూప్ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, “మా ఆస్పత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులందరికీ సాదర స్వాగతం. డాక్టర్ రఘు రామ్ చేపట్టిన ప్రతి పని 100% విజయాల రేటుతో చేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆయన్ను నేను దగ్గరగా చూస్తున్నాను. మాతృ ప్రేమ, మాతృభూమి పట్ల ప్రేమ అతనిని యూకే నుంచి భారత్‌కు తిరిగి తీసుకొచ్చింది, అక్కడ ఆయన అనేక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ చికిత్స తీరును సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు. దేశానికి ఆయన చేసిన అందమైన సేవలకు మరిన్ని విజయాలు దక్కుతాయి” అని ఆకాంక్షించారు.

మిస్ వరల్డ్ 2025 బృందానికి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈఓ మిస్ జూలియా మోర్బీ నేతృత్వం వహించారు. గత 18 సంవత్సరాలలో ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజ్ సెంటర్ కిమ్స్ ఆస్పత్రుల ద్వారా చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడకు హాజరైన పలువురు వైద్యనిపుణులను ఉద్దేశించి మిస్ జూలియా మోర్బీ మాట్లాడుతూ, “డాక్టర్ రఘు రామ్ హైదరాబాద్‌లో దక్షిణ ఆసియాలోనే మొదటిసారిగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో తన సొంత ఆలోచనలతో రూపొందించిన ఈ అసాధారణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా అద్భుతమైన నాయకత్వ పటిమను చాటి చూపించారు. త్వరగా గుర్తించడం ద్వారా 18 ఏళ్లు దాటిన అనేక మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు గణనీయమైన కృషిని ఆయన చేశారు. భారతదేశం, బ్రిటన్‌ల మధ్య సజీవ వంతెనగా అనేక మార్గాల్లో ఆయన నిలిచారు. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అపారమైన సేవలు అందిస్తున్నారు” అని తెలిపారు.

నందిని గుప్తా (మిస్ ఇండియా 2025), హన్నా జాన్స్ (మిస్ నార్తరన్ ఐర్లండ్ 2025) ఇస్సీ ప్రిన్సెస్ (మిస్ కామెరూన్- మధ్య ఆఫ్రికా), రొమ్ము క్యాన్సర ప్రచారకర్త డాక్టర్ నియోమి మైల్న్ (మిస్ గౌడెలోప్ 2025- ఫ్రాన్స్),డాక్టర్ ఇదిల్ బిల్గెన్ (యూఎస్ఏ) తదితరులంతా డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసించారు. తన తల్లి డాక్టర్ ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ప్రయాణంతో స్ఫూర్తి పొందిన ఆయన.. ఇలా దేశంలో చాలామందికి అసవరమైన రొమ్ము క్యానన్సర్ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తమ తమ దేశాల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహనకు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పారు. డాక్టర్ రఘురామ్ అద్భుతంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ నుంచి తాము చాలా తెలుసుకున్నామని, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అమలు చేసిన ప్రయత్నాలను తమ స్వదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ సదర్భంగా కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, “కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ బ్రెస్ట్ డిసీజెస్ కేంద్రంలో నాణ్యమైన సమయం గడిపేందుకు ముందుకొచ్చిన మిస్ ఇండియా పోటీదారుఉల, మిస్ జూలియా మార్లీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా పవర్ పాయింట్ ప్రజంటేషన్ గురించి గుండెలకు హత్తుకునేలా చెప్పారు.గత 18 ఏళ్లుగా నేను చేస్తున్న కృషి అందులో ఉంది. మా అమ్మ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రయాణమే నాకు స్ఫూర్తినిచ్చింది. నా సహోద్యోగులు, స్నేహితులు, ప్రభుత్వం అంతా నాకు ఇంతకాలం కావాల్సిన మద్దతు, మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. రొమ్ము క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చాలా జీవితాలను కాపాడవచ్చు. నా మాతృభూమిలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలను మెరుగుపచాలన్న నా లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, క్యాన్సర్ విజేత డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ మాట్లాడుతూ, “డాక్టర్ రఘురామ్ వద్ద చికిత్స పొందడం నా అదృష్టం. నాకు అందిన అసాధారణ నాణ్యత గల చికిత్స, సానుభూతితో కూడిన సంరక్షణ, చికిత్స కొనసాగినన్నాళ్లు ఆయన నాకు చేసిన కౌన్సెలింగ్ వల్లనే నేను క్యాన్సర్ విజేతగా నిలిచాను. నా ఈ పయనంలో డాక్టర్ రఘురామ్ నాకు స్ఫూర్తినిచ్చి, సానుకూలంగా ఉండేలా చేయడం నాకెంతో సంతృప్తినిచ్చింది. క్యాన్సర్ రోగుల్లో ఒక ఆశను పాదుకొల్పి, త్వరగా గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన నెలకొల్పి, దాదాపు రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్న డాక్టర్ రఘురామ్ సేవలను ప్రశంసిస్తున్నాను”అని చెప్పారు.