కరీంనగర్‌లో గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది: బండి సంజయ్‌ | Bandi Sanjay Reaction To Karimnagar Corporation Victory | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది: బండి సంజయ్‌

Feb 13 2026 7:27 PM | Updated on Feb 13 2026 7:35 PM

Bandi Sanjay Reaction To Karimnagar Corporation Victory

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ గెలవడం గొప్ప విషయం అని.. ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్‌ జనం గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్‌కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్‌ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని.. ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్‌ అన్నారు.

‘‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు ఓటర్లు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. ఒకనాడు రెండు సీట్లతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కోట్ల రూపాయలు వెదజల్లారు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి లక్షలిస్తామన్నారు. మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం ఆల్రెడీ. ఇండిపెండెంట్స్ గా గెల్చినవారు కూడా మాకు మద్దతిస్తారు.ఎంఐఎం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురేసిన పార్టీ బీజేపీ’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement