నల్లగొండ అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే నల్లగొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి | Komati Reddy Venkat Reddy Congratulates Winning Candidates Of Congress In Nalgonda Municipal Corporation Elections | Sakshi
Sakshi News home page

నల్లగొండ అంటే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటే నల్లగొండ: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Feb 13 2026 11:02 PM | Updated on Feb 14 2026 1:13 PM

Congratulations to winning candidates of Congress in Nalgonda Municipal Corporation elections: Komati Reddy Venkat Reddy

నల్లగొండ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో సత్తా చాటాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరంపర కొనసాగుతుంది

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ ఆదరించిన రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు

బిఆర్ఎస్ ఓటమి ఒప్పుకొని...ఆత్మ విమర్శ చేసుకోవాలి

రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కార ఎజెండాగా మా పాలన కొనసాగుతుంది

ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం

 రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు.ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. 

మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారు

ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement