‘ఎన్ని విమర్శలు, వెటకారాలు చేసినా కాంగ్రెస్‌కే పట్టం కట్టారు’ | TPCC Chief Mahesh Kumar Goud On Party Victory | Sakshi
Sakshi News home page

‘ఎన్ని విమర్శలు, వెటకారాలు చేసినా కాంగ్రెస్‌కే పట్టం కట్టారు’

Feb 13 2026 7:37 PM | Updated on Feb 13 2026 7:45 PM

TPCC Chief Mahesh Kumar Goud On Party Victory

నిజామాబాద్:  తమ పార్టీపై ఎన్నో విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని, అదే ఇంతటి ఘన విజయానికి కారణమైంద్నార.  మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నిజమాబాబ్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 70 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించారు. 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదు. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ, ఎంఐఎంలు లబ్ధిపొందాయి. సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రజల కోరికలను నెరవేర్చేలా పాలిస్తున్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్‌ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement