
మిస్ వరల్డ్ 2025
కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్ బట్ నాట్ లీస్ట్ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...
నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేషన్ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్‌ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్ ఉంది. స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.
బ్యూటీ విత్ పర్పస్
మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు కావలసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం కూడా ఓ సెక్షన్ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్‌నెస్ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్ నీడ్ పిల్లల కోసం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే! అలాగే టాలెంట్ రౌండ్‌లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్ రౌండ్‌లో స్విమ్మింగ్. స్విమింగ్ ఈజ్ మై ఫేవరిట్ స్పోర్ట్.
మర్యాద, మాట తీరు..
రిచ్ కల్చర్, ట్రెడిషన్ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా.
అందుకే కనెక్ట్ అయ్యాను..
నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు బిగ్ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్ అయ్యాను. విమెన్ ఎంపవర్‌మెంట్ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు!
– నటాషా న్యో న్యో జీ – యుగాండా
– సరస్వతి రమ