
నటాషా- హార్దిక్- మహీక (PC: Insta)
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
తొలుత యూఏఈతో మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయిన హార్దిక్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. సయీమ్ ఆయుబ్ రూపంలో కీలక వికెట్ కూల్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన హార్దిక్.. సాహిబ్‌జదా ఫర్హాన్ (40), మొహమ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్‌లు అందుకుని ఫీల్డర్‌గా తన వంతు పాత్ర పూర్తి చేశాడు.
ఇక పాక్ విధించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హార్దిక్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో రూ. 22 కోట్ల ధర కలిగిన వాచ్ ధరించి హాట్ టాపిక్ అయ్యాడు.
మూడుసార్లు పెళ్లి
తాజాగా హార్దిక్ పాండ్యా రిలేషన్‌షిప్‌నకు సంబంధించి మరో వార్త తెరమీదకు వచ్చింది. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించిన హార్దిక్.. ఆమెను పెళ్లాడాడు. వీరికి కుమారుడు అగస్త్య సంతానం. అయితే, కోవిడ్ సమయంలో ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయామన్న లోటు లేకుండా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో కుమారుడి ముందే ఈ జంట వివాహం చేసుకుంది.
జాస్మిన్‌కు కూడా గుడ్‌బై?
ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నామంటూ గతేడాది ప్రకటన విడుదల చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత నటాషా కొన్నాళ్లు సెర్బియా వెళ్లిపోగా.. ఇంతలో హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇవి నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, హార్దిక్ జాస్మిన్‌కు కూడా గుడ్‌బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అతడు మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీక శర్మతో హార్దిక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పరస్పరం సోషల్ మీడియాలో ఫాలో కావడంతో పాటు.. మహీక ప్రతీసారి హార్దిక్‌కు సంబంధించిన హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.
నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?
ఇక హార్దిక్ పాండ్యా తాజా ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న వేళ.. అతడి మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన సాంగ్ క్లిప్ వైరల్ అవుతోంది. ‘‘నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా హాట్‌గా ఉండాలని కోరుకోవా.. నీ గర్ల్‌ఫ్రెండ్ నాలా ఫ్రీక్‌గా ఉండాలని కోరుకోవా?’’ అంటూ సాగే లిరిక్స్‌కు పెదాలు కదుపుతూ నటాషా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది.