ఫుల్ వయొలెంట్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా? | Vijay Deverakonda Rowdy Janardhana Telugu Title Glimpse out now | Sakshi
Sakshi News home page

Rowdy Janardhana Movie: 'ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే'.. ఫుల్ మాస్‌ గ్లింప్స్ చూశారా?

Dec 22 2025 7:48 PM | Updated on Dec 22 2025 8:12 PM

Vijay Deverakonda Rowdy Janardhana Telugu Title Glimpse out now

కింగ్‌డమ్ ‍తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్‌ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ గ్లింప్స్‌లో ఫైట్ సీన్స్‌ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్‌ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా..  ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారని టాక్. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement