
'మిస్ వరల్డ్ 2025' పోటీలలో భాగంగా ఈ రోజు (మంగళవారం).. 120 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. చుడీ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. ఆ తరువాత చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇక్కడే మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటక ప్రాంతం గురించి తెలిపే ఫోటో గ్యాలరీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
చౌముల్లా ప్యాలెస్ అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. తెలంగాణ జరూర్ ఆనా నినాదం మా దేశాల్లో వినిపిస్తామని వారు అన్నారు.