ఒక్కో కౌన్సిలర్‌కి రూ. 3 కోట్లు ఆఫర్‌ చేశారు: కేటీఆర్‌ | BRS Working President KTR Slams Congress Govt | Sakshi
Sakshi News home page

ఒక్కో కౌన్సిలర్‌కి రూ. 3 కోట్లు ఆఫర్‌ చేశారు: కేటీఆర్‌

Feb 24 2026 5:49 PM | Updated on Feb 24 2026 5:51 PM

BRS Working President KTR Slams Congress Govt

హైదరాబాద్‌:  మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా క్యాతన్‌పల్లిలో అధికార పార్టీకి తమ నేతలు లొంగలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తమ ఒక్కో కౌన్సిలర్‌కు రూ. 3 కోట్లు ఆఫర్‌ చేశారని కేటీఆర్‌ అన్నారు. తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. 

క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌లో మళ్లీ ఎన్నికలు పెట్టాలని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. క్యాతన్‌పల్లి స్పష్టమైన మెజార్టీతో గెలిచామన్నారు. ఇక పొత్తు ధర్మం పాటిస్తున్న సీపీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

కాగా, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 10 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను దక్కించుకుంది.  అయితే మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడుతూ, రాజకీయ పార్టీల మధ్య పోటీ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమి కలిసి ఎక్కువ వార్డులు గెలిచినప్పటికీ, కాంగ్రెస్ కూడా గణనీయమైన స్థానాలు సాధించింది. ఈ కారణంగా చైర్మన్‌ పదవి ఎవరికీ దక్కుతుందనే అంశం ఇంకా తేలలేదు, ఎన్నికల ప్రక్రియలో వివాదాలు, వాయిదాలు చోటు చేసుకుంటున్నాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement