సాక్షి హైదరాబాద్:TGSRTC ప్రయాణికుల మరింత సౌకర్యవంతమైన సేవల కోసం "మీ సేవ మీ టికెట్" పేరుతో నూతన మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఈ రోజు మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి , మీసేవ కమీషనర్ శ్రీ రవికిరణ్ తో పాటు ఇతర అధికారులతో కలిసి మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.
ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సుదూర ప్రయాణాలకు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. యాప్ ద్వారా మెుత్తం 1,710 ఓపీఆర్ఎస్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉండనున్నాయన్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ జంట నగరాల పరిధిలో కార్యకలాపాల కోసం T24 టికెట్‌ను కూడా మీటికెట్ మొబైల్ యాప్‌లోనే పొందవచ్చని తెలిపారు.


