మిల్లా మాగిపై అసభ్య ప్రవర్తన ఆ ముగ్గురి పనేనా? ఇంతకీ ఎవరా ముగ్గురు? | Harish Rao Reaction On Miss World Contestant Milla Magee Issue | Sakshi
Sakshi News home page

Milla Magee: మిల్లా మాగిపై అసభ్య ప్రవర్తన ఆ ముగ్గురి పనేనా? ఇంతకీ ఎవరా ముగ్గురు?

Jun 2 2025 2:51 PM | Updated on Jun 2 2025 3:32 PM

Harish Rao Reaction On Miss World Contestant Milla Magee Issue

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్‌వరల్డ్‌ పోటీలపై మాజీ మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై హరీష్‌ రావు తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిస్‌ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై హరీష్‌ రావు స్పందిస్తూ.. అందాల పోటీలు నిర్వహించడం రాక కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ పరువు తీశారని అన్నారు. రేవంత్‌ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఎంపీ, కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఐఏఎస్‌ అధికారి మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ  పట్ల అసభ్యకరంగా,అభ్యంతరకరంగా ప్రవర్తించారని వార్తలొస్తున్నాయని అన్నారు. ఆ ముగ్గురు కారణంగా మిస్‌ ఇంగ్లండ్‌ అందాల పోటీల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్‌కు చిత్త శుద్ది ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజీ భయటపెట్టాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement