‘ఓట్లు తొలగించి ‘లోక్‌తంత్ర బచావో’ అనడం హాస్యాస్పదం’ | Defeat BJP at the Centre to Truly Save Democracy, Says Telangana CPIM | Sakshi
Sakshi News home page

‘ఓట్లు తొలగించి ‘లోక్‌తంత్ర బచావో’ అనడం హాస్యాస్పదం’

Nov 24 2026 10:00 PM | Updated on Nov 24 2026 10:00 PM

Defeat BJP at the Centre to Truly Save Democracy, Says Telangana CPIM

దేశవ్యాప్తంగా ‘సర్‌’ పేరుతో అక్రమంగా 13 కోట్ల ఓట్లను తొలగించడంపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, దానికి మద్దతుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణకు వచ్చి పాదయాత్ర నిర్వహించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. “లోక్‌తంత్ర బచావో - అరాజకత హటావో” అనే నినాదంతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, నిజానికి దేశంలో, రాష్ట్రంలో అరాచకత్వాన్ని లేకుండా చేయాలంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందుగా కేంద్రంలోని బీజేపీని ఓడించాలని  ప్రజలకు సీపీఐ(ఎం)పిలుపునిస్తోంది.

చనిపోయిన వారి ఓట్లను, రెండుచోట్ల ఉన్నవారి ఓట్లను తొలగిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, ఇక్కడే పుట్టి పెరిగి  పనుల కోసం, వృత్తుల కోసం, బ్రతుకుదెరువు కోసం వలస వెళ్లిన  దేశ పౌరులను కూడా చొరబాటుదారులనే నెపంతో శాశ్వతంగా వారిని ఓటు హక్కుకు దూరం చేయడం దారుణం. బీజేపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తమ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రలో భాగమే.

పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇదే తెలియజేస్తున్నాయి. తెలంగాణలోనూ 92 లక్షలకు పైగా ఓట్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. అడ్డదారుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కుట్రతో బీజేపీ ‘మహా పాదయాత్ర’ల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కేవలం పగటి కల మాత్రమేనని, రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే సీట్లు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని సీపీఐ(ఎం) స్పష్టం చేస్తున్నది. ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement