సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురి మృతి | Three die after falling into a septic tank | Sakshi
Sakshi News home page

సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురి మృతి

Nov 24 2026 3:16 PM | Updated on Nov 24 2026 3:19 PM

 Three die after falling into a septic tank

మేడ్చల్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దీపక్ హారీక్ అపార్ట్మెంట్ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. వారు ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలుస్తోంది. 

వారి ముగ్గురిని హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి పేర్లు సుమన్(24), సురేష్ (25), పవన్ (25)గా తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసుల వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement