
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, భారత్ యుద్ధం కొనసాగుతుండగా హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (John Wesley) అన్నారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాద చర్యలను సీపీఎం ఖండిస్తుందన్నారు. హిట్లర్ ఫాసిజంపై నాటి సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషనరహరి స్మారక కేంద్రంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రపంచదేశాలను అక్రమించుకోవాలన్న కుట్ర, కుతంత్రాలతో నియంత హిట్లర్ సాగించిన దూకుడుకు ఎర్రజెండా అడ్డుకట్టవేసిందన్నారు. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తూ రష్యాను సైతం ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నానికి 1945లో కమ్యూనిస్టు సైన్యం అడ్డుకట్టవేసి సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు నాయకత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామేల్, జగదీశ్, ఈ.నర్సింహ, జగన్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
500 మంది పోలీసులతో బందోబస్తు: మాదాపూర్ డీసీపీ
మిస్ వరల్డ్ పోటీలకు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ తెలిపారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మాదాపూర్ జోన్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ ఈవెంట్‌కు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లు ఉంటాయన్నారు. దాదాపు 500 మంది పోలీసులతో వివిధ చోట్ల బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్, పాక్ సరిహద్దులో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
‘మిస్ వరల్డ్’ పోటీల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ: జీహెచ్‌ఎంసీ కమిషనర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మిస్ వరల్డ్ కార్యక్రమం నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియం, పరిసరాల్లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేడియం చుట్టూ పోటీలకు సంబంధించిన వివరాలు తెలిసేలా ప్రచార సామగ్రిని పెట్టించాలని అడ్వర్జైట్‌మెంట్ అదనపు కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. కమిషనర్ వెంట వెస్ట్‌జోన్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోఖడే హేమంత్ సహదేవ్‌రావు, అడ్వరై్టజ్‌మెంట్ అదనపు కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులుతున్నారు.
చదవండి: మానవత్వానికి పట్టం.. సేవకు కిరీటం..