
నగరంలో మిస్ వరల్డ్ తారల సందడి
కళ్లు చెదిరే వస్త్ర సోయగాలతో ఫొటోలకు ఫోజులు
సాంస్కృతిక సమ్మేళనం.. అందాల సోయగం..
హైదరాబాద్: నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్‌కి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ వ్రస్తాలతో అందాల తారలు హొయలు పోయారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రత్యేకతలను తెలుసుకునేందుకు పోటీదారులు ఉత్సాహం చూపుతున్నారు.
ఇందులో భాగంగా బుధవారం హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా తమ తమ దేశాల వస్త్రధారణతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది అధునాత సాంస్కృతిక సమ్మేళనంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడి అధునాతన జీవనశైలి, ముఖ్యంగా ఆహారం తమకు ఎంతగానో నచ్చిందని పలువురు తారలు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల కోసం నిత్యనూతనంగా సన్నద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు.