
సాయంకాలాన.. సాగర తీరాన.. అని ఇటీవల ఓ చిత్రంలోని పాట గుర్తొచ్చేలా.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేశారు.
ఇందులో భాగంగా కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించి తెలంగాణ విశిష్టతలను తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మితమైన చారిత్రక కట్టడాల తిలకించి వాటి ప్రత్యేకతలను ఆరాతీశారు. భాగ్యనగరం అంటేనే ఓ చారిత్రక నేపథ్యం ఉన్న నగరం.. ఇక్కడ విభిన్న రకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసి ఉంటాయి. అలాంటి సమ్మిళితమైన జీవనశైలి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
అలాగే మిస్ వరల్డ్ పోటీదారులను నగర సంస్కృతి ఆకట్టుకుంటోంది. మిస్ వరల్డ్ పోటల్లో పాల్గొంటున్న ఆయా దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంలో పాలుపంచుకుంటూ నగరంలో సందడి చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ఆహ్వానం మొదలు గచ్చిబౌలి ప్రారంభ వేడుకల వరకూ నగర ప్రత్యేకతలను ఆశ్చర్యంగా ఆరా తీస్తున్నారు.
అంతటితో ఆగకుండా ఆయా చారిత్రక, ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎక్స్‌పీరియం పార్క్‌ను సందర్శించి అక్కడ ప్రత్యేకంగా నిర్వహించిన టమాటోరినా ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఇక మంగళవారం చారిత్రాత్మక లాడ్ బజార్లో, చార్మీనార్ వీధుల్లో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మిస్ వరల్డ్ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథులు సన్నహాలు పూర్తి చేశారు.
మిస్ థాయ్‌లాండ్ ఓపాల్ సుచేత వంటి పలువురు తారలు ఇప్పటికే తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు వేదికల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్‌పోటీల నేపథ్యంలో ముందస్తుగా రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా నగరంలోని మరికొన్ని సందర్శనీయ ప్రదేశాల్లో, ఇతర కార్యక్రమాక్లూ పాల్గోనున్నారు.
(చదవండి: ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ)