మంత్రులు, పీసీసీ చీఫ్‌తో సీఎం జూమ్ మీటింగ్ | CM Revanth Holds Zoom Meeting with Ministers and PCC Chief | Sakshi
Sakshi News home page

మంత్రులు, పీసీసీ చీఫ్‌తో సీఎం జూమ్ మీటింగ్

Feb 15 2026 9:43 PM | Updated on Feb 16 2026 8:55 AM

CM Revanth Holds Zoom Meeting with Ministers and PCC Chief

హైదరాబాద్:  మేయర్‌,  డిప్యూటీ మేయర్‌, చైర్‌ పర్సన్‌, డిప్యూటీ చైర్‌ పర్సన్‌ ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ)  మున్సిపల్‌, కార్పొరేషన్‌లకు సంబంధించి చైర్‌ పర్సన్‌, డిప్యూటీ చైర్‌ పర్సన్‌, మేయర్‌,  డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. 

ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా  వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్‌ మీటింగ్‌లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement