
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 వేదిక పై మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్ కాంపిటీషన్ ఫినాలేలో తెలుగు సాంగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్‌తో పలువురు ఉర్రూతలూగించారు.
24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండో స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు.
సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్‌ను తన తల్లి డిజైన్ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది.
చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టారు.
(చదవండి: అమేజింగ్ అమ్మాయిలు)