
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు...
‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది.
ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్‌హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్‌గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది.
ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్‌గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్‌గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్‌సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.
– రమ సరస్వతి
ఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్