Miss Puerto Rico
-
అమేజింగ్ అమ్మాయిలు
ఈమె పేరు.. వలేరియా పేరస్. మిస్ ప్యూర్టో రికో! వృత్తిరీత్యా టీచర్. మిడిల్ స్కూల్ పిల్లలకు సైన్స్ బోధిస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, ఆతిథ్యం గురించి వలేరియా పంచుకున్న విషయాలు... ‘‘మిస్ వరల్డ్ కోసం 119 మంది అమేజింగ్ అమ్మాయిలతో పోటీ వావ్ అనిపిస్తోంది. ఈ పోటీల కోసం ఇండియా.. ఎస్పెషల్లీ హైదరాబాద్ రావడం సూపర్బ్ ఫీలింగ్. ఇక్కడి హాస్పిటాలిటీ నాకు చాలా నచ్చింది. మా ఇంటిని, దేశాన్ని వదిలి ఎక్కడో సుదూర తీరాలకు వచ్చినట్టేమీ అనిపించడం లేదు. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. మేమంతా భిన్న దేశాల నుంచి వచ్చినవాళ్లమనే భావన కలగట్లేదు. చాలా త్వరగా మా మధ్య బాండింగ్ ఏర్పడింది. ఇనాగ్యురల్ ఫంక్షన్ రోజు.. మేమంతా ఒకరికొకరం మేకప్ చేసుకున్నాం. హెయిర్ స్టయిల్ చేసుకున్నాం. జ్యూవెలరీ కూడా ఎక్సేఛేంజ్ చేసుకున్నాం. అంత అద్భుతమైన సిస్టర్హుడ్ డెవలప్ అయింది మా మధ్య! ఇక్కడికి రావడానికి ముందు కొంచెం భయమేసింది.. ఇక్కడి మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాతావరణం ఎలా ఉంటుందో అని! కానీ ల్యాండ్ అయ్యాక.. ఇక్కడి వాళ్ల మర్యాద చూస్తున్నాను కదా.. ట్రెమండస్! పహల్గామ్ ఘటనతో దేశంలో ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి కదా! అది కూడా కొంచెం భయపెట్టింది. ఫార్చునేట్లీ అంతా ప్రశాంతంగానే ఉంది. ఉండాలి కూడా! అయితే ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మా సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మాకెలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకుంది. చూసుకుంటోంది. తెలంగాణ కల్చర్, ఆర్ట్.. రిచ్ అండ్ క్రియేటివ్‌గా ఉంది. ఫుడ్ కొంచెం కారంగా ఉన్నా డెలీషియస్‌గా ఉంది. నచ్చింది. నా బ్యూటీ విత్ పర్పస్ విషయానికి వస్తే.. ఆటిజం, డౌన్‌సిండ్రోమ్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నాను. అంతేకాదు సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసమూ కృషిచేస్తున్నాను. మనుషులందరూ సమానమే! కాబట్టి అవకాశాలూ సమానంగా ఉండాలి. ఉన్నవాళ్లు, లేనివాళ్లు, జెండర్ విభేదాలు ఉండకూడదు. అంతేకాదు ప్రతివారికీ వారికే ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి, ఆ దిశగా వాళ్ల ప్రయాణం సాగేందుకు సాయపడుతున్నాను’’ అన్నారు వలేరియా.– రమ సరస్వతిఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్ -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇద్దరు అందగత్తెలు.. వీడియో వైరల్
పెళ్లంటే అందమైన జ్ఞాపకం.. ఎన్నో ఊహలు, ఆశలు, అనుభూతుల సమ్మేళనం. నూతన జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరకొకరం తోడుంటామని చేసే వాగ్దానం. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం కామన్. దీనికి భిన్నంగా ఈ మధ్య అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం. అచ్చం ఇలాగే ఓ ఇద్దరు అమ్మాయిలు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరు సాధారణ యువతులు కాదు. ఇద్దరూ అందగత్తెలు అవ్వడం మరింత విశేషం. మిస్ అర్జెంటీనా(2020) మెరియానా, మిస్ ప్యురెటో రికో(2020) ఫాబియోలా వాలెంటిన్ అధికారికంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లిద్దరు 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో తొలిసారి ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ పోటీల్లో అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే కంబైండ్‌గా ఓ ఇన్‌స్టా పేజీని కూడా ఓపెన్ చేశారు. కొంత కాలంగా స్నేహితులం అని చెప్పుకుంటూ సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపించారు. తాజాగా అక్టోబర్ 28న వివాహ బంధంతో ఒక్కటైనట్టు వెల్లడించారు. తమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఓ అందమైన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘ఇప్పటి వరకు మా రిలేషన్‌ను ప్రైవేట్‌గా ఉంచాలని అనుకున్నాం. ఇకపై అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు (అక్టోబర్ 28) ఎంతో ప్రత్యేకం’ అంటూ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టులో ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా కనిపించారు. హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ, ముద్దులతో ముంచేస్తూ చూడముచ్చటగా ఉన్నారు. చివర్లో ఎంగేజ్డ్ అని సంకేతంలో ఉంగరాలను చూపిస్తూ తమ బంధాన్ని అధికారికం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్ష లైకులు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వీళ్ల వివాహం వారి వారి దేశాల్లో కచ్చితంగా చెల్లుతుంది. స్వలింగ వివాహాలకు అర్జెంటీనా 2010లోనే ఆమోద ముద్ర వేయగా.. ప్యురెటో రరికో మాత్రం 2015లో చట్టబద్ధం చేసింది. View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) -
మిస్ వరల్డ్‌గా పొర్టారికో సుందరి
-
ముస్లింలపై అందాల భామ ట్వీట్ల దుమారం!
మిస్ పోర్టారికో- 2015గా ఎంపికైన అందాల భామ డెస్టినీ వెలెజ్ ముస్లింల గురించి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన అందాల పోటీ నిర్వాహక సంస్థ మిస్ పోర్టారికో ఆర్గనైజేషన్ ఆమెను నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 'మనమందరం ముస్లింలమే' అంటూ దర్శకుడు మైఖేల్ మూర్ గతవారం ఆన్లైన్లో ఓ ప్రచారం చేపట్టారు. ఇందులోభాగంగా 'వుయ్ ఆర్ ముస్లిం' అన్న ప్లకార్డు పట్టుకొని ఫొటోలు దిగి ఆన్లైన్లో పెట్టాల్సిందిగా ఆయన నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డెస్టినీ వెలెజ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'అమెరికాను భయపెట్టేందుకు ముస్లింలు మన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. యూదులు, క్రైస్తవులతో ముస్లింలకు ఎలాంటి పోలిక లేదు. యూదులు, క్రైస్తవుల పవిత్ర పుస్తకాల్లో టెర్రర్ అజెండాలు లేనేలేవు. చమురు సమకూర్చడం, ఈ దేశాన్ని భయపెట్టడం, ఎంతమందిని భయభ్రాంతులకు గురిచేయడం ఇదే ముస్లింలు చేస్తున్నారు' అని ఆమె ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తన ట్విట్టర్ పేజీని తొలగించి.. క్షమాపణలు చెప్పింది. మరోవైపు ఆమె వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదని మిస్ పోర్టారికో ఆర్గనైజేషన్ పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు తమ సంస్థ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. సంస్థ ఆశయాలకు విరుద్ధంగా పోటీదారులు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, అందుకే ఆమెను సస్పెండ్ చేశామని తెలిపింది.