సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇద్దరు అందగత్తెలు.. వీడియో వైరల్‌

Miss Argentina Miss Puerto Rico Get Married. Watch Adorable Video - Sakshi

పెళ్లంటే అందమైన జ్ఞాపకం.. ఎన్నో ఊహలు, ఆశలు, అనుభూతుల సమ్మేళనం. నూతన జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరకొకరం తోడుంటామని చేసే వాగ్దానం. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం కామన్‌. దీనికి భిన్నంగా ఈ మధ్య అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం. అచ్చం ఇలాగే ఓ ఇద్దరు అమ్మాయిలు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరు సాధారణ యువతులు కాదు.  ఇద్దరూ అందగత్తెలు అవ్వడం మరింత విశేషం.

మిస్‌ అర్జెంటీనా(2020) మెరియానా, మిస్‌ ప్యురెటో రికో(2020) ఫాబియోలా వాలెంటిన్ అధికారికంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లిద్దరు 2020 మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో తొలిసారి ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ పోటీల్లో అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారు.  ఈ క్రమంలోనే కంబైండ్‌గా ఓ ఇన్‌స్టా పేజీని కూడా ఓపెన్ చేశారు.

కొంత కాలంగా  స్నేహితులం అని చెప్పుకుంటూ  సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపించారు. తాజాగా అక్టోబర్ 28న వివాహ బంధంతో ఒక్కటైనట్టు వెల్లడించారు. తమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఓ అందమైన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

‘ఇప్పటి వరకు మా రిలేషన్‌ను ప్రైవేట్‌గా ఉంచాలని అనుకున్నాం. ఇకపై అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు (అక్టోబర్‌ 28) ఎంతో ప్రత్యేకం’ అంటూ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టులో ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా కనిపించారు. హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్‌ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ, ముద్దులతో ముంచేస్తూ చూడముచ్చటగా ఉన్నారు. చివర్లో ఎంగేజ్‌డ్‌ అని సంకేతంలో ఉంగరాలను చూపిస్తూ తమ బంధాన్ని అధికారికం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్ష లైకులు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ పొందింది. కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక వీళ్ల వివాహం వారి వారి దేశాల్లో కచ్చితంగా చెల్లుతుంది. స్వలింగ వివాహాలకు అర్జెంటీనా 2010లోనే ఆమోద ముద్ర వేయగా.. ప్యురెటో రరికో మాత్రం 2015లో చట్టబద్ధం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top