breaking news
Argentina fans attack
-
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్‌కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్‌కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్‌ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్‌లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఇద్దరు అందగత్తెలు.. వీడియో వైరల్
పెళ్లంటే అందమైన జ్ఞాపకం.. ఎన్నో ఊహలు, ఆశలు, అనుభూతుల సమ్మేళనం. నూతన జీవితానికి నిలువెత్తు సాక్ష్యం. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఒకరకొకరం తోడుంటామని చేసే వాగ్దానం. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం కామన్. దీనికి భిన్నంగా ఈ మధ్య అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం. అచ్చం ఇలాగే ఓ ఇద్దరు అమ్మాయిలు మూడు మూళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వీరు సాధారణ యువతులు కాదు. ఇద్దరూ అందగత్తెలు అవ్వడం మరింత విశేషం. మిస్ అర్జెంటీనా(2020) మెరియానా, మిస్ ప్యురెటో రికో(2020) ఫాబియోలా వాలెంటిన్ అధికారికంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లిద్దరు 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో తొలిసారి ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ పోటీల్లో అర్జెంటీనా, ప్యూర్టో రికోలకు ప్రాతినిధ్యం వహించారు. తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే కంబైండ్‌గా ఓ ఇన్‌స్టా పేజీని కూడా ఓపెన్ చేశారు. కొంత కాలంగా స్నేహితులం అని చెప్పుకుంటూ సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపించారు. తాజాగా అక్టోబర్ 28న వివాహ బంధంతో ఒక్కటైనట్టు వెల్లడించారు. తమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఓ అందమైన వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘ఇప్పటి వరకు మా రిలేషన్‌ను ప్రైవేట్‌గా ఉంచాలని అనుకున్నాం. ఇకపై అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు (అక్టోబర్ 28) ఎంతో ప్రత్యేకం’ అంటూ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టులో ఇద్దరు ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా కనిపించారు. హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ, ముద్దులతో ముంచేస్తూ చూడముచ్చటగా ఉన్నారు. చివర్లో ఎంగేజ్డ్ అని సంకేతంలో ఉంగరాలను చూపిస్తూ తమ బంధాన్ని అధికారికం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. లక్ష లైకులు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వీళ్ల వివాహం వారి వారి దేశాల్లో కచ్చితంగా చెల్లుతుంది. స్వలింగ వివాహాలకు అర్జెంటీనా 2010లోనే ఆమోద ముద్ర వేయగా.. ప్యురెటో రరికో మాత్రం 2015లో చట్టబద్ధం చేసింది. View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) View this post on Instagram A post shared by Fabiola Valentín 🌙 (@fabiolavalentinpr) -
జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానుల ఆగ్రహం
బ్రెజిల్ : ప్రపంచ ఫుట్‌బాల్ సాకర్‌లో తమ జట్టు ఓటమిపై అర్జెంటీనా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా జర్మనీ అభిమానులు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనలో 15మంది అభిమానులు గాయపడ్డారు. పలు దుకాణాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బ్రెజిల్ పోలీసులు అర్జెంటీనా అభిమానులపై బాష్పవాయువు ప్రయోగించారు. 40మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇక ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్‌బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా. ఫుట్‌బాల్‌పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం. అందుకు పై ఘటన కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా సాకర్‌పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే.


