అమెరికా లాంటి కొన్ని దేశాల్లో.. పిల్లలను స్కూల్ బస్సులు ఎక్కించేటప్పుడు లేదంటే దింపేటప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ దానంతట అదే ఆగిపోతుంది. పిల్లలు కొద్దిదూరం వెళ్లిన తర్వాతే వాహనాలు ముందుకు కదులుతాయి. అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్.. లేదంటే పోలీసు అవసరం ఉండదు. పిల్లల సేఫ్టీ అనేది అక్కడి ప్రజల జీవనశైలిలో ఇదొక భాగమైపోయింది. కానీ, మన దేశంలో.. !
ముంబై నగరంలో అంతా చూస్తుండగానే ఘోరం జరిగింది. స్కూల్ బస్సు దిగిన ఓ చిన్నారిని ఆమె నాయనమ్మ రోడ్డు దాటిస్తున్న క్రమంలో.. బస్సు ముందుకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ పెద్దావిడ చేతిలో ఉన్న ఏడాది పసికందు ప్రాణం విడిచింది. ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.
మంగళవారం మధ్యాహ్నాం ఖేట్‌వాడీ ఏరియాలోని గిర్‌గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రకళ అనే పెద్దావిడ తన ఏడాది మనవడిని చంకలో వేసుకుని.. స్కూల్ నుంచి వచ్చే మనవరాలిని ఇంటికి తెచ్చేందుకు వెళ్లింది. అయితే ముగ్గురూ బస్సు ముందు నుంచి రోడ్డు దాటుతుండగా.. డ్రైవర్ అది గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు ఢీ కొట్టి ముగ్గురూ కింద పడిపోయారు.
చిన్నారి పక్కకు పడిపోగా.. చంద్రకళ, ఆమె ఏడాది మనవడి మీదుగా బస్సు వెళ్లింది. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేయగా.. స్థానికులు అప్రమత్తమై వాళ్లను బయటకు తీసే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది చిన్నారి అప్పటికే మరణించగా.. గాయపడిన చంద్రకళను ఆస్పత్రికి తరలించారు.
డీబీ మార్గ్ పోలీసులు స్కూల్‌బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తాలుకా దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు కాగా.. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.
मुंबई में स्कूली बस ने ही दो बच्चों और उनकी
अभिभावक को कुचल दिया! एक बच्चे की मौत हो गई दूसरा घायल है। अभिभावक भी बस के नीचे आ गई और वो भी गंभीर रूप से घायल है।
मैं जानता हूं कि ये भारत है अमेरिका नहीं लेकिन फिर भी ये लिख रहा हूं कि जब भी अमेरिका जाता हूं, देखता हूं और आप भी… pic.twitter.com/RHcmGOUmEp— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) January 28, 2026


