Iran war ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ భీకరదాడులు, ఇరాన్ సుప్రీం నేత హత్య తరువాత ఇరాన్‌కూడా అదే స్థాయిలో ప్రతిదాడులకు దిగింది. దీంతో సోషల్ మీడియాలో పలు అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వాస్తవం ఏంటి?
ఇజ్రాయెల్ ప్రధాని అధికారికసోషల్ మీడియా ఖాతా నుండి ఆయన మరణించారని ప్రకటించిన సందేశానికి పోస్ట్ కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు వైరల్‌గా మారాయి. అంతేకాదు ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో ఏఐతో రూపొందించారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. పాత వీడియోకు కొత్త వాయిస్‌ను జోడించారనే పుకార్లు షికారు చేశాయి.
నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నాయా?
నెతన్యాహు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియో వైరల్ అయింది. దీంతో వీడియోలు నెతన్యాహుకు ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించిందనీ, ఇది ఏఐతో సృష్టించిన వీడియో అని రూమర్లు వ్యాపించాయి. అసలు ఆయన బతికే ఉన్నారా అనే ఆందోళన రేగింది. జియోనిస్ట్ నాయకుడు ఎక్కడ ఉన్నాడనేది సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది.
అసలు నిజం ఏమిటంటే
ఇజ్రాయెల్ నాయకుడి మరణం గురించి ఆన్‌లైన్‌లో వ్యాపించిన పుకార్లను అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ఫ్యాక్ట్-చెకర్లు , వార్తా సంస్థలు ఇప్పటికే తోసిపుచ్చాయి.నెతన్యాహు సురక్షితంగా ఉన్నారనీ, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో AI సృష్టి అని తేలింది. ఈ వీడియోలు ఫేక్ వీడియోలు అని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు తేల్చారు.
ది సండే గార్డియన్ ఉటంకించిన విశ్లేషకుల ప్రకారం, ఈ పుకార్లు ఎక్కువగా నకిలీ స్క్రీన్‌షాట్‌లు, తప్పుడు దృశ్యాలు. తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కాలంలో ఇవి ధృవీకరించని కంటెంట్ ఆధారంగా రూపొందించినవి. ఈ వాదనలకు ధృవీకరించబడిన ఆధారాలు లేవు.
ఇదీ చదవండి: షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అలాగే ఆరువేళ్లున్నాయనే విషయంపై కూడా ఫ్యాక్ట్ చెకర్లు స్పందించారు. అది ఆప్టికల్ భ్రమ అనీ, ఒకే ఫ్రేమ్‌ను విడిగా పరిశీలించినప్పుడు కెమెరా కోణాలు, మోషన్ బ్లర్చ హ్యాండ్ పొజిషనింగ్ లాంటి తప్పుదారి పట్టించే దృశ్యాలను ఉత్పత్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు.


