షాకింగ్‌ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష | Indian origin brothers face 835 year jail term in US | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష

Mar 14 2026 3:05 PM | Updated on Mar 14 2026 4:09 PM

Indian origin brothers face 835 year jail term in US

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన  భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్‌ సవానీ(60), అరుణ్‌ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు.  మనీలాండరింగ్‌, హెచ్‌1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్‌ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు.  అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.

US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన  సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను  అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్‌ ద్వారా  30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు
 
ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...

హెచ్-1బి (H-1B) వీసా  స్కాం
వీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్‌బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

మెడికేడ్ (Medicaid) కుంభకోణం
భాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం  ‘మెడికేడ్‌’ను  ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.

మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేత
వచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.

దారుణమైన వైద్య ప్రయోగాలు
అంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్‌ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.

మనీలాండరింగ్‌ ద్వారా కార్పొరేట్‌ బ్యాంక్‌ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత,  భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని  కూడా దోషిగా  తేల్చింది కోర్టు.

శిక్షలు  ఇలా  ఉండబోతున్నాయి
భాస్కర్‌కు 420 ఏళ్లే, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలతో పాటు చట్టబద్ధమైన గరిష్ట శిక్షను ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు  విధించింది.  ఈ ఏడాది  జూలో 2026లో శిక్ష  అమలు కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement