బెంగళూరు: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ముఖ్య గమనిక. భారతీయ రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మీదుగా నడిచే నాలుగు కీలక వందే భారత్ రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. ఈ సవరించిన వేళలు నేటి నుంచే (మార్చి 15, 2026) అమలులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 164 వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఈ స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వేళలు మారిన రైళ్లు ఇవే:
హైదరాబాద్ (కాచిగూడ) - బెంగళూరు (యశ్వంత్‌పూర్), కలబుర్గి - బెంగళూరు (SMVT) మధ్య నడిచే రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.
కాచిగూడ – యశ్వంత్‌పూర్ (20703): ఈ రైలు హిందూపూర్ స్టేషన్‌కు ఇదివరకు ఉన్న సమయం కంటే కొన్ని నిమిషాల ఆలస్యంగా చేరుకుంటుంది.
యశ్వంత్‌పూర్ – కాచిగూడ (20704): తిరుగు ప్రయాణంలో కూడా హిందూపూర్ స్టేషన్‌లో ఈ రైలు చేరే సమయంలో స్వల్ప మార్పు ఉంటుంది.
కలబుర్గి – SMVT బెంగళూరు (22231): ఈ సర్వీసు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌కు సవరించిన సమయానికి చేరుకుంటుంది.
SMVT బెంగళూరు – కలబుర్గి (22232): ఈ రైలు యలహంక స్టేషన్‌కు గతంలో కంటే ఆలస్యంగా చేరుకుంటుంది.
గమనించాల్సిన అంశాలు
SMVT బెంగళూరు – కలబుర్గి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గతంలో మాదిరగానే వారానికి ఆరు రోజులు (గురువారం మినహా) నడుస్తుంది. బిజీ రూట్లలో వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, స్టేషన్లలో రద్దీని మేనేజ్ చేయడానికి, రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఖచ్చితమైన సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?


