ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో సింగిల్ ఫేస్‌లో ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో పలు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇది వరకే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్నికల కమిషన్ ప్రకటన నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కనున్నాయి.


