
గచ్చిబౌలి స్టేడియం లోపలికి వెళ్లేందుకు యత్నం
వివిధ మహిళా సంఘాల నేతలు అరెస్ట్
హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి అయిన మిస్ వరల్డ్ పోటీలను నిరసిస్తూ వివిధ మహిళా సంఘాల నేతలు గచ్చిబౌలి స్టేడియం వద్ద శనివారం సాయంత్రం మెరుపు ధర్నా నిర్వహించారు. మిస్ వరల్డ్ వేడుకల ప్రారంభోత్సవం సమయంలో భారీ బందోబస్తు ఉన్నా పోలీసుల కళ్లు గప్పి స్టేడియం ప్రధాన ద్వారం సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకోవడం గమనార్హం. గచ్చిబౌలి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా రోప్‌తో పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం వారిని వాహనంలో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉద్విగ్న భరిమైన పరిస్థితుల్లో అందాల పోటీలను నిర్వహించడమేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని చెబుతూనే రూ.200 కోట్లు ఖర్చుపెట్టి మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నేతలు వి.సంధ్య, ఝాన్సీ, అనురాధ, ఐఎఫ్‌టీయూ అరుణ, మహేష్, నాగరాజు, వివిధ మహిళా సంఘాల నేతలు ఎడ్ల జయ, రాణి, జయసుధ, సావిత్రి, సవిత, శ్రీఏదేవితోపాటు సింహద్రి, రవి పాల్గొన్నారు.